ETV Bharat / city

తెలంగాణలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్​ కేసులు - telangana covid

తెలంగాణలో కొవిడ్‌ విజృంభణకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నిమిషానికి ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఈనెలలో రోజుకు సగటున 15వందలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం... వైరస్‌ వ్యాప్తి నియంత్రించేందుకు శ్రమిస్తోంది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌...జిల్లాల్లో పర్యటిస్తూ వైద్యసేవలను పరిశీలిస్తున్నారు.

covid cases increase in telangana last one month
తెలంగాణలో తగ్గని కరోనా ఉద్ధృతి
author img

By

Published : Jul 27, 2020, 10:29 AM IST

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నెల 1 నుంచి 25 వరకూ 37,720 కేసులు నిర్ధారణ అయ్యాయి. సగటున నిమిషానికొక వ్యక్తి కరోనా బారినపడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ సహా అన్ని జిల్లాల్లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్వీయ నియంత్రణ ద్వారానే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సత్వరమే జిల్లాల్లో పర్యటించి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో కొవిడ్‌ చికిత్సలను సమీక్షించేందుకు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం కామారెడ్డి, నిజామాబాద్‌లో వైద్యసేవలను సమీక్షించారు.

గ్రేటర్​లో తగ్గుముఖం..

గత కొద్దిరోజులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌, పరిసర జిల్లాల్లో కొంత తగ్గినట్లు అనిపిస్తున్నా.. జిల్లాల్లో బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వరంగల్‌లో రోజుకు సగటున వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్‌, నల్గొండ, నిజామాబాద్‌ తదితర రెండో స్థాయి పట్టణాల్లోనూ కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. ఇంతవరకు పల్లెల్లోకి అంతగా చేరకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం.

పరిస్థితిని చక్కదిద్దేందుకు..

వైరస్‌ మున్ముందు పల్లెలనూ చుట్టుముట్టే అవకాశాలున్నాయని వైద్యఆరోగ్యశాఖ అంచనాకు వచ్చింది. దీన్ని చక్కదిద్దేందుకు నడుం బిగించింది. గతవారంలో వైద్యమంత్రి జిల్లా వైద్యాధికారులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమీక్షించారు. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, కొన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రభుత్వం కొవిడ్‌ చికిత్సకు ఏర్పాట్లు చేసింది. బాధితులకు స్థానికంగానే వైద్యసేవలు అందించాలని ఆదేశాలిచ్చింది. జిల్లా ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్లను ఏర్పాటు చేసింది. అవసరాలకు తగ్గట్లు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని ఎక్కడికక్కడే నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది.

ముందుగానే గుర్తించడం ద్వారా...

కొవిడ్‌ బాధితులను ముందుగా గుర్తించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడమే కాకుండా.. ప్రమాదం అంచుల్లోకి వెళ్లే అవకాశమున్నవారికి త్వరగా చికిత్స అందించి కాపాడవచ్చనే లక్ష్యంతో.. అన్ని స్థాయుల ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోంది. పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులతో పాటు ఖరీదైన కొవిడ్‌ ఔషధాలను కూడా జిల్లాలకు తరలించింది. వైద్య మంత్రి జిల్లా పర్యటనల్లో ప్రధానంగా ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవలు, కరోనాయేతర సేవలను పరిశీలిస్తున్నారు.

కనీస జాగ్రత్తలు ఏవి?
వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నా.. కొందరు కనీస జాగ్రత్తలూ పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుంపులుగా చేరడం, మాస్కు ధరించకపోవడం, చేతులు శుభ్రపరుచుకోకపోవడం.. తదితర కారణాలతో వైరస్‌ వ్యాపిస్తోంది.

ఇవీ చూడండి: ఆ రైతింట 'సోనూ'లిక ట్రాక్టర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.