ETV Bharat / city

Warangal rape case: అత్యాచారం కేసు.. తెరాస కార్పొరేటర్ భర్త అరెస్టు - వరంగల్ జిల్లా తాజా వార్తలు

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచార కేసు నిందితుడు కార్పొరేటర్ భర్త ఆకుతోట శిరీశ్‌ను ఎట్టకేలకు ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. శిరీశ్‌తో పాటు అతని తండ్రి సుధాకర్‌ను మిల్స్ కాలనీ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

Warangal rape case
అత్యాచారం కేసు.. తెరాస కార్పొరేటర్ భర్త అరెస్టు
author img

By

Published : Oct 1, 2021, 11:35 AM IST

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచార కేసు నిందితుడు కార్పొరేటర్ భర్త ఆకుతోట శిరీశ్‌ను ఎట్టకేలకు ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. శిరీశ్‌తో పాటు అతని తండ్రి సుధాకర్‌ను మిల్స్ కాలనీ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడినట్లు.. గత నెల 23న యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

తెలంగాణలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త కావడం... తండ్రి లిక్కర్‌ వ్యాపారి కావడంతో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. స్థానికంగా ఓ ప్రజా ప్రతినిధి యువతితో రాజీకోసం మంతనాలు జరిపినా ఫలించకపోవడం వల్లే పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిందితులను పరకాల సబ్ జైలుకు తరలించారని సమాచారం. యువతి ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ భర్త శిరీశ్‌పై అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపు తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదీ జరిగింది....

2017 నుంచి శిరీష్​ ప్రేమిస్తున్నానంటూ.. తన వెంట పడి వివాహం చేసుకుంటానని నమ్మించినట్లు యువతి... పోలీసులకు తెలిపింది. తనను పెళ్లి పేరిట నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. నగర శివారు ప్రాంతంలోని తమ కుటుంబ సభ్యుల పేరిట గల భూమిని విక్రయించగా.. వచ్చిన డబ్బు నుంచి 90లక్షల రూపాయలు శిరీష్ ఖాతాల్లో జమచేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకుంటాడనే నమ్మకంతో పెద్దమొత్తంలో డబ్బును శిరీష్ ఖాతాల్లో వేసినట్టు లావాదేవీల ఆధారాలతో పోలీసులకు వివరించింది. అయితే శిరీష్ మరో యువతిని పెళ్లి చేసుకుని తనను మోసం చేయడమే కాకుండా.... తన డబ్బులు తిరిగివ్వకుండా తండ్రి సుధాకర్​తో కలిసి బెదిరింపులకు దిగాడని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి: selfie suicide: 'మీ అందరినీ వదిలిపెట్టి పోవాలని లేదమ్మా!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.