ETV Bharat / city

Suicide Attempt: ఆటోడ్రైవర్​ ఆత్మహత్యాయత్నం.. కార్పొరేటర్​​ వేధింపులే కారణమని ఆరోపణ

Suicide Attempt: ఇల్లు సరిపోకపోవడంతో పైఅంతస్తు వేసుకునేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 3వ తేదీన స్లాబ్ వేద్దామనుకున్నాడు. అంతలోనే ఇల్లు కట్టడానికి వీలులేదని, కొంత డబ్బు ఇవ్వాలని వైకాపా కార్పొరేటర్​, పంచాయతీ ఈవో డిమాండ్​ చేశారు. స్లాబ్ కోసం సిద్ధం చేసుకున్న సెంట్రింగ్​ను తీసి వేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురంలో జరిగింది.

CORPORATER ARRESMENT SUCIDED ATEMPT
CORPORATER ARRESMENT SUCIDED ATEMPT
author img

By

Published : Feb 7, 2022, 1:51 PM IST

west godavari crime: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ సుంకరపు తోటకు చెందిన ఆటో డ్రైవర్ పిడుగుల వెంకటగాంధీ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కట్టుకున్న ఇల్లు సరిపోకపోవడంతో పైఅంతస్తు వేసుకునేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 3వ తేదీన స్లాబ్ వేద్దామనుకున్నాడు. ఇంతలో ఆరో డివిజన్ వైకాపా కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్, పంచాయతీ ఈవో ధర్మ గోవిందు ఇల్లు కట్టడానికి వీలు లేదంటూ వేధింపులకు గురి చేశారని బాధితుడి భార్య తెలిపింది.

60వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో నడుపుకునే నా వద్ద అన్ని డబ్బులు ఇచ్చుకోలేనని చెప్పినా పట్టించుకోకుండా వేధింపులకు గురి చేశారని వెంకటగాంధీ భార్య తెలిపింది. స్లాబ్ కోసం సిద్ధం చేసుకున్న సెంట్రింగ్​ను సిబ్బంది తీసి వేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరింది.

ఇదీ చదవండి:

Kidnap: చిన్నారుల కిడ్నాప్.. కాపాడిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.