ETV Bharat / city

గ్రామాలపై కరోనా పంజా.. మున్ముందు రెట్టింపవుతాయనే ఆందోళన! - పల్లెల్లోనూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి

కొవిడ్ మహమ్మారి పల్లెల్లోనూ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే దాదాపు 270 మండలాలు, సుమారు 1,500 గ్రామాల్లోకి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ఇదే ఉద్ధృతి కొనసాగితే నెల రోజుల్లోనే దాదాపు 5,000 గ్రామాలను వైరస్‌ చుట్టుముట్టే ప్రమాదముందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సత్వరమే కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి నివేదించింది.

many villages infected with corona virus in telangana
గ్రామాలపై కరోనా పంజా.. మున్ముందు రెట్టింపవుతాయనే ఆందోళన!
author img

By

Published : Aug 3, 2020, 9:35 AM IST

కరోనా మహమ్మారి పల్లెల వైపు కోరలు చాస్తోంది. ఆరు వారాల కిందట తెలంగాణలో జీహెచ్‌ఎంసీ, పరిసరాల్లోని మూడు జిల్లాలు మినహా మరెక్కడా పెద్దగా జాడ లేని కొవిడ్‌ ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ జడలు విప్పుతోంది. ఇప్పటికే దాదాపు 270 మండలాలు, సుమారు 1,500 గ్రామాల్లోకి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. రాష్ట్రంలో రోజుకు సుమారు 1,800-2,000 వరకూ కరోనా కేసులు నమోదవుతుండగా జీహెచ్‌ఎంసీ (సుమారు 500-600)లో కంటే జిల్లాల్లోని కేసులే 1,300-1,400 వరకూ ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దశలో అడ్డుకోకపోతే.. వచ్చే నాలుగైదు వారాల్లో పల్లెసీమల్లోనే కొవిడ్‌ బాధితులు ఎక్కువయ్యే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే ఉద్ధృతి కొనసాగితే నెల రోజుల్లోనే దాదాపు 5,000 గ్రామాలను వైరస్‌ చుట్టుముట్టే ప్రమాదముందని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సత్వరమే కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి నివేదించింది.

  • లోపించిన అవగాహన

హైదరాబాద్‌ సహా ముంబయి, కోల్‌కతా, దిల్లీ, చెన్నై తదితర మహానగరాల్లో కేసుల సంఖ్య ఉద్ధృతం కాగా.. చాలామంది సొంత గ్రామాల బాట పట్టారు. ఇలా ఒక్కో గ్రామానికి పదుల సంఖ్యలో కొత్తగా వచ్చినట్లు అధికారుల అంచనా. అలాంటివారు కొందరి ద్వారా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు క్రమేణా వైరస్‌ వ్యాప్తి చెందింది. కట్టడి చర్యలు పట్టణాల్లో జరిగినంతగా పల్లెల్లో జరగడం లేదు. గ్రామీణ ప్రజల్లోనూ కరోనా వ్యాప్తి పట్ల అంతగా అవగాహన లేదు. వర్షాలు కురవడంతో పొలం పనులు ముమ్మరమయ్యాయి. ఇక్కడ వ్యక్తిగత దూరం పాటించడంలేదు.

కొందరు ముఖానికి మాస్కు లాంటిది ఏదో ఒకటి ధరిస్తున్నా.. దాన్ని కూడా సరైన విధానంలో వినియోగించడం లేదు. వీటితో పాటు గ్రామీణం నుంచి సమీప పట్టణాలకు, నగరాలకు వ్యాపార, వ్యవసాయ, ఇతర అవసరాల కోసం నిత్యం రాకపోకలు సాగుతున్నాయి. ఇప్పటికే రెండో స్థాయి పట్టణాల్లో పెరుగుతున్న కేసులు.. అక్కడినుంచి పల్లె ముంగిటకు చేరుతున్నాయి. వైరస్‌ కట్టడిపై కరపత్రాలు, గోడపత్రాల ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తోంది.

ప్రచారాంశాలు:

  • జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి సమస్యలుంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలి.
  • ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఈ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకొని, అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి.
  • ముఖానికి తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
  • ఒకేచోట ఎక్కువమంది గుమిగూడొద్దు. వ్యక్తుల మధ్య కచ్చితంగా ఆరు అడుగుల దూరాన్ని పాటించాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా వస్తువును ముట్టుకున్నా.. ఎవరితోనైనా కరచాలనం చేయాల్సి వచ్చినా తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు

  • ఆర్‌టీ-పీసీఆర్‌ విధానం: కాకతీయ వైద్యకళాశాల, వరంగల్‌.
  • సీబీనాట్‌ విధానం: రిమ్స్‌ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, గద్వాల, కొత్తగూడెం, కరీంనగర్‌.
  • యాంటీజెన్‌ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్‌ 3, భద్రాద్రి కొత్తగూడెం 6, జగిత్యాల 3, జనగామ 1, జయశంకర్‌ భూపలపల్లి 2, ములుగు 4, జోగులాంబ గద్వాల 2, కామారెడ్డి 8, కరీంనగర్‌ 4, ఖమ్మం 4, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ 2, మహబూబాబాద్‌ 3, మహబూబ్‌నగర్‌ 3, నారాయణపేట 3, మంచిర్యాల 4, మెదక్‌ 4, మేడ్చల్‌ 2, నాగర్‌కర్నూలు 5, నల్గొండ 5, నిర్మల్‌ 4, నిజామాబాద్‌ 10, పెద్దపల్లి 4, సిరిసిల్ల 1, రంగారెడ్డి 8, సంగారెడ్డి 6, సిద్దిపేట 5, సూర్యాపేట 4, వికారాబాద్‌ 5, వనపర్తి 3, వరంగల్‌ గ్రామీణ 3, వరంగల్‌ నగరం 2, యాదాద్రి భువనగిరి 4.

జిల్లాల్లో కొవిడ్ పడకలు

  • మొత్తం- 4,709
  • ఆక్సిజన్ సౌకర్యం- 2,175
  • ఐసీయూలు-623
  • ఇతర ఐసోలేషన్-1,911

వైద్యసేవల విస్తరణ ఇలా...

జీహెచ్‌ఎంసీ కాకుండా.. అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ సేవల కోసం ప్రభుత్వం 4,708 పడకలను నెలకొల్పింది. వాటిలో ఆక్సిజన్‌ పడకలు 2,175, ఐసీయూ పడకలు 623 ఉన్నాయి. పరిస్థితి తీవ్రతను బట్టి జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల సేవలను వినియోగించుకునే దిశగా యోచిస్తోంది. స్థానికంగా చికిత్స అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు కొవిడ్‌ చికిత్సలపై శిక్షణ ఇప్పించనుంది. 104, 108 అంబులెన్సు సేవలను విస్తరించాలని, కొత్త వాహనాలను సమకూర్చుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది.

ఎక్కడికక్కడే పరీక్షలు

  • జిల్లాల్లో వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎక్కడికక్కడే పరీక్షలు, చికిత్సలను అందించేలా ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోనూ సత్వరమే ఫలితాలను అందించే యాంటీజెన్‌ పరీక్షలను నిర్వహిస్తోంది.
  • 7 జిల్లాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌, సీబీనాట్‌ పరీక్ష కేంద్రాలను నెలకొల్పింది. జీహెచ్‌ఎంసీలో మాదిరిగానే సంచార పరీక్షల వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనివల్ల బాధితులను త్వరగా గుర్తించి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యపడుతుందని ఆరోగ్యశాఖ నివేదించింది.
  • ఇప్పటికే నమోదవుతున్న కేసులను బట్టి ఒక్కో జిల్లాల్లో సుమారు 40-50 కంటైన్‌మెంటు ప్రాంతాలను గుర్తించింది.

ఇదీ చూడండి : ' రైతులకిచ్చిన హామీలకు సర్కారుదే పూచీ.. వెనక్కు తగ్గడానికి వీల్లేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.