ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: బోసిపోతున్న ఆపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు - కరోనా వచ్చే.. సీటీ ఖాళీ అయ్యే

కరోనా ప్రభావం టౌన్​షిప్​లపైన కూడా పడింది. అపార్టుమెంట్లు, గేటెడ్​ కమ్యూనిటీలు బోసిపోతున్నాయి. ఐటీ ఉద్యోగులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడం వల్ల... భాగ్యనగరంలోని టౌన్​షిప్​లు ఖాళీ అయ్యాయి.

empty apartments because of carona in hyd
కరోనా వచ్చే.. సీటీ ఖాళీ అయ్యే
author img

By

Published : Jul 29, 2020, 6:29 PM IST

హైదరాబాద్​ నగర శివారులోని పోచారం మున్సిపాలిటీలోని సంస్కృతి టౌన్‌షిప్‌. నిన్న మొన్నటి వరకు ఉదయం లేచినప్పట్నుంచి రాత్రి వరకు కార్యాలయాలకు వెళ్లి వచ్చే ఐటీ ఉద్యోగులతో కళకళలాడేది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనికి అనుమతించాయి. తిరిగి పరిస్థితులు ఎప్పటికీ చక్కబడతాయో తెలియని పరిస్థితి. కొందరు ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఇళ్లు తీసుకుని ఉండేవారు. బ్యాచిలర్స్‌ అయితే నలుగురైదుగురు కలిసి ఉండేవారు. ఇప్పుడు వారందరూ ఇళ్లు ఖాళీచేసి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. 1200 కుటుంబాలు నివాసం ఉండగా.. ఇప్పుడు 550 కుటుంబాలే ఉంటున్నట్లు టౌన్‌షిప్‌ సంక్షేమ సంఘం నిర్వాహకులు చెబుతున్నారు. యజమానులే ఉంటుండగా.. అద్దెకు ఉన్న వారందరూ దాదాపు ఖాళీ చేసిన పరిస్థితి. దీనికితోడు నిర్వహణ ఛార్జీల రూపేణా నెలకు రూ.కోటి వసూలయ్యేది. ఇప్పుడు బకాయిలు పేరుకుపోయాయి.

భాగ్యనగరం ఐటీకి ఆలవాలం.. ఐటీ కంపెనీల రాకతో ఎక్కడికక్కడ సమీప ప్రాంతాల రూపురేఖలే మారిపోతున్న పరిస్థితి. అపార్టుమెంట్లు, టౌన్‌షిప్‌ల రాకతో నివాస, వాణిజ్య కార్యకలాపాలు పెరిగి హైటెక్‌సిటీలోనే కాకుండా శివారుల్లోని నానక్‌రాంగూడ, పోచారం, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌, ఆదిభట్ల ప్రాంతాల్లో కొత్త కళ సంతరించుకుంది. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం. కరోనా మహమ్మారి కారణంగా నగరంలో ఐటీ కంపెనీలు మూతపడటంతో టౌన్‌షిప్‌లు, అపార్టుమెంట్లు సందడి లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. తర్వాత అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో కంపెనీలు తెరుచుకోలేదు. వర్చ్యువల్‌ సమావేశాలు నిర్వహించుకుని విధులు నిర్వర్తిస్తున్నారు.

నిర్వహణ ఛార్జీల భారం.. ఐటీ ఉద్యోగులు ఖాళీ చేయడంతో అపార్టుమెంట్ల నిర్వహణ సంక్షేమ సంఘాలకు తలకు మించిన భారంగా మారింది. అద్దెకున్న వారి నుంచి నిర్వహణ ఛార్జీలు తీసుకునేవారు. ఇప్పుడు వారందరూ ఖాళీ చేయడంతో నిర్వహణ రుసుములు వసూలు కావడం లేదని సంక్షేమ సంఘాల నాయకులు చెబుతున్నారు. కొందరు ఉద్యోగులు మాత్రం తిరిగి వస్తామన్న నమ్మకంతో ఇళ్లు ఖాళీ చేయలేదు. వారు ప్రతినెలా అద్దె చెల్లిస్తుండటంతో ఇబ్బందుల్లేవు. శివారుల్లో ఖాళీ అయినచోట నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది. ‘నిర్వహణ ఛార్జీలు వసూలు కాక తాము చెల్లించాల్సిన బకాయి రూ.కోటిన్నర వరకు ఉంద’ని సంస్కృతి టౌన్‌షిప్‌ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మెట్టు బాల్‌రెడ్డి తెలిపారు.

కొండాపూర్‌లోని మరో అపార్టుమెంట్‌. 21 ఫ్లాట్లు ఉండగా.. ఇప్పుడు 11 ఫ్లాట్లు ఖాళీ అయిన పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులు ఇక్కడ అద్దెకు ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ ఐటీ ఉద్యోగుల కావడం, బ్యాచిలర్స్‌గా ఉన్న ఉద్యోగులు ఇళ్లు పూర్తిగా ఖాళీ చేశారు. తమ కంపెనీ ఈ డిసెంబరు వరకు ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇచ్చిందని, తర్వాత పరిస్థితినిబట్టి ఇళ్లు తీసుకోవాలా.. వద్ధా. ఆలోచిస్తామని చెప్పి ఫ్లాట్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.