ETV Bharat / city

రాళ్లెత్తే కూలీలేరీ?

author img

By

Published : May 19, 2020, 9:08 AM IST

కరోనా మహమ్మారి భయం.. పనులు లేక పస్తులుండాల్సి రావడంతో వలస కార్మికులు స్వస్థలాలకు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ ప్రభావం నిర్మాణ, ఉత్పాదక రంగాలపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్రంలో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల కూలీలే ఎక్కువగా పని చేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లేవారు ఇప్పట్లో తిరిగొచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా కనీసం ఐదారు నెలల తర్వాతే. దీంతో రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధప్రాజెక్టుల పనులు నిలిచిపోతున్నాయి.

corona effect on constructions
నిర్మాణరంగంపై కరోనా ప్రభావం

కూలీలు తిరిగి రావడం ఎంత ఆలస్యమైతే ప్రాజెక్టుల నిర్మాణం అంత జాప్యమవుతుంది. తీసుకున్న రుణాలపై వడ్డీ భారం పడుతుంది. నగరాలు, పట్టణాల్లో కూలీల కొరత తీవ్రమవుతుంది. ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావటంతో ప్రాజెక్టు వ్యయాలు అధికమవుతాయి. కొన్ని పనులు చేయటంలో కొందరికే నైపుణ్యం ఉంటుంది. పెయింటింగ్‌, చెక్క పని, ఫాల్స్‌ రూఫింగ్‌ లాంటి పనుల్లో ఉత్తరాది కార్మికులు నిపుణులు.

వాళ్ల రాక ఆలస్యమైతే ఆ పనులు మందగిస్తాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్‌ పరిశ్రమలోని వివిధ విభాగాల్లో 40 వేల మంది వరకూ వివిధ రాష్ట్రాల వలస కూలీలు పనిచేస్తున్నారు. వీళ్లు వచ్చేవరకు కార్యకలాపాలలో జాప్యం తప్పదని ఓ గ్రానైట్‌ పరిశ్రమలో సీనియర్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు వివరించారు.

* ‘‘లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి మాకు పనులూ, ఆదాయం రెండూ లేవు. 50 రోజుల పాటు పట్టించుకున్నవారే లేరు. పరిస్థితి ఇంకా విషమిస్తే మేము బతకటం కష్టమైపోతుంది. అందుకే మా ఊళ్లకు వెళ్లిపోతున్నాం’’ అని బిహార్‌కు చెందిన రూపేష్‌యాదవ్‌ వివరించారు.

* ‘‘మమ్మల్ని పనుల కోసం తీసుకొచ్చిన కాంట్రాక్టరు లాక్‌డౌన్‌ తొలిరోజుల్లో ఆహారం అందించారు. తర్వాత మా వద్దకు రావడమే మానేశారు. తిండికీ ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ మాకేమైనా జరిగితే ఆదుకునేవారూ లేరు. అందుకే వెళ్లిపోతున్నాం’’ అని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆశిష్‌ వివరించారు.

* ‘‘ఊరెళ్తే మాకున్న దాంట్లో సర్దుకుని బతకొచ్చు. లేబర్‌ క్యాంపుల్లో ఏ మాత్రం సదుపాయాలు లేవు’’ అని ఛత్తీస్‌గఢ్‌ వాసి దుష్యన్‌ సుధాకర్‌ తెలిపారు.

* గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ భవనాల నిర్మాణంలో 1,300 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా ఝార్ఖండ్‌, బిహార్‌, అసోం రాష్ట్రాల వారే. ఇప్పటికే కొందరు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరు తిరిగి వచ్చేవరకు పనులు నత్తనడకన సాగాల్సిందేనని, గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడంపైనా ఈ ప్రభావం పడుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధి సుధీర్‌ తెలిపారు.

* ‘‘విజయవాడ పరిసరాల్లో 1000 వరకూ నిర్మాణ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటిలో 50వేల మందికిపైగా ఇతర రాష్ట్రాల వారే పనిచేస్తున్నారు. వీరంతా సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో ప్రాజెక్టులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది’’ అని విజయవాడ క్రెడాయ్‌ అధ్యక్షుడు ఆర్‌.వి.స్వామి చెప్పారు.

ఇదీ చదవండి:

పోరాడుతున్నా... వెంటాడుతూనే ఉంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.