ETV Bharat / city

ఆటాడితే అంతే.. కరోనాతో చింతే.. - తెలంగాణలో కరోనా కేసులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిలేదు.. బయటకు వెళ్లే అవకాశమూ లేదు.. రోజుల తరబడి ఇంట్లో కూర్చొని ఏమి చేయాలి? ఈ క్రమంలోనే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఇంటిపట్టునే ఉండి అష్టాచమ్మా, పేకాట, క్యారంబోర్డు, పచ్చీస్‌, షటిల్‌, కబడ్డీ వంటి ఆటలతో ఇంట్లోనో, ఇంటి ముంగిటో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇకమీదట ఈ ఆటల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. మరీముఖ్యంగా చుట్టుపక్కల వారితో కలిసి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆడవద్దని, ఇలాంటి ఆటలు కూడా కరోనాను తెచ్చిపెడతాయని హెచ్చరిస్తున్నారు.

ఆటాడితే అంతే.. కరోనాతో చింతే..
ఆటాడితే అంతే.. కరోనాతో చింతే..
author img

By

Published : Apr 28, 2020, 1:39 PM IST

తెలంగాణలోని సూర్యాపేటలో ఓ మహిళ అష్టాచమ్మా ఆడటం ద్వారా 31 మందికి, విజయవాడలో లారీ డ్రైవర్‌ పేకాట ఆడటం వల్ల అనేక మందికి కరోనా సోకినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నలుగురైదుగురు కలిసి ఆడే ఆటలకు పోలీసులు అభ్యంతరం చెబుతున్నారు. అష్టాచమ్మా ఆడే వారిలో ఒకరికి కరోనా ఉన్నా వారు తుమ్మినప్పుడో, దగ్గినప్పుడో చుట్టూ కూర్చున్న మిగతా వారికి వైరస్‌ సోకే అవకాశం ఉంటుంది. అలాగే ఆడేందుకు వాడే చింత పిక్కలు, పాచికలను అంతా పట్టుకుంటారు. ఇక్కడా వ్యాధి ఉన్న వారి ద్వారా మిగతా అందరికీ సోకే అవకాశముంటుంది.

క్యారమ్స్‌, పేకాట, షటిల్‌, క్రికెట్‌, కబడ్డీలదీ ఇదే పరిస్థితి. కరోనా సమయంలో ఇలాంటి ఆటలు ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి ఆటలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రమే ఆడుకునేందుకు కొంత వెసులుబాటు ఉన్నా చుట్టుపక్కల వారితో కలిసి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆడవద్దంటున్నారు. ఈ మేరకు కాలనీల పెద్దల్ని పిలిపించి పరిస్థితి వివరిస్తున్నారు. ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా సోకితే అది మిగతా వారికీ వ్యాపించే అవకాశం ఎక్కువ కాబట్టి ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు కూడా వ్యక్తిగత దూరం పాటించాలని కోరుతున్నారు.

జాగ్రత్త అవసరం

ఇంటి దగ్గర ఆటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖాళీగా ఉంటున్నామని అనేక చోట్ల ఇంట్లో కూర్చొని ఆడే ఆటలతో పాటు షటిల్‌ బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, కబడ్డీ వంటివి ఆడుతున్నారు. ఇలాంటి ఆటలతోనూ కరోనా వ్యాపించే అవకాశం ఉంది. ఒకర్ని ఒకరు తాకే ఆటలన్నీ ప్రమాదమే. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఆడటం కంటే చుట్టుపక్కల వారంతా కలిసి ఆడినప్పుడు ప్రమాద తీవ్రత పెరుగుతుంది. అందుకే ఇలాంటి ఆటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మహేష్‌భగవత్‌, పోలీసు కమిషనర్‌, రాచకొండ

ఇవీ చూడండి: సుజల దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో సాక్షాత్కారం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.