రాష్ట్రంలో కొత్తగా 438 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 8,78,723కు చేరింది. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7,076కు పెరిగింది. 589 మంది బాధితులు కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్నవారు 8.67 లక్షలు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,202 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 64,236 కరోనా పరీక్షలు నిర్వహించగా..మొత్తం పరీక్షల సంఖ్య కోటి 12 లక్షలు దాటింది.
వైరస్ సోకి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
జిల్లాల వారీగా కేసులు..
కృష్ణాజిల్లాలో అధికంగా 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు-80, గుంటూరు-54, విశాఖ-40, తూర్పుగోదావరి-38, నెల్లూరు-24, ప్రకాశం-23, పశ్చిమగోదావరి-21, విజయనగరం-20, అనంతపురం-20, శ్రీకాకుళం-14, కడప-14, కర్నూలు జిల్లాలో ఏడుగురు మహమ్మారి బారిన పడ్డారు.
ఇదీ చదవండి: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు