ETV Bharat / city

విద్యార్థుల్లో 0.47%, ఉపాధ్యాయుల్లో  0.87% మందికి కరోనా వైరస్‌ - ఏపీలో విద్యాసంస్థల్లో కరోనా ప్రభావం వార్తలు

రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి కరోనా నమూనాలను సేకరిస్తున్నారు. మొత్తం 665 మండలాలు ఉండగా 661 మండలాల్లో ఈనెల 2 నుంచి ఇప్పటివరకు 1,52,342 నమూనాలు సేకరించగా 550 (0.47%) మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు.

education
education
author img

By

Published : Nov 20, 2020, 7:42 AM IST

తూర్పు గోదావరిలో 26,165 నమూనాలు సేకరిస్తే 121 కేసులు బయటపడ్డాయి. పశ్చిమగోదావరిలో 13,069కు నలభై, విజయనగరం జిల్లాలో 3,646కు ఒక్క కేసూ నమోదవలేదు. కర్నూలు జిల్లాలో 21,213 నమూనాలను పరీక్షిస్తే 20 కేసులు వచ్చాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు/అధ్యాపకుల్లో 33,859 మంది నుంచి సేకరించిన నమూనాలు పరీక్షించగా 239 (0.87%) మందికి పాజిటివ్‌ వచ్చింది. విశాఖపట్నంలో ఉపాధ్యాయుల్లో 3,499 మంది నుంచి నమూనాలు సేకరిస్తే 42 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. కృష్ణా జిల్లాలో 2,218 నమూనాలు పరీక్షిస్తే... 12 మందికి వైరస్‌ సోకింది.

వివిధ రంగాల్లో (భవన నిర్మాణ కూలీలు, మార్కెట్లో పనిచేసే కూలీలు, ఇతరులు) పనిచేసే వ్యక్తుల నుంచి సైతం నమూనాలను ర్యాండమ్‌గా సేకరించి కొద్దిరోజులుగా పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు 9,86,799 నమూనాలను పరీక్షించగా 73,842 కేసులు బయటపడ్డాయి.

35 లక్షలు దాటిన యాంటీజెన్‌ పరీక్షలు

రాష్ట్రంలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల సంఖ్య 35 లక్షలు దాటింది. వారిలోని 4 లక్షల మందికి వైరస్‌ సోకగా 31 లక్షల మందికి నెగిటివ్‌ వచ్చింది. యాంటీజెన్‌ పరీక్షల ద్వారా నెగిటివ్‌ వచ్చినా... అనుమానిత లక్షణాలు ఉన్నందున 2,90,314 మంది నుంచి సేకరించిన నమూనాలను మరోసారి ఆర్టీపీసీఆర్‌ ద్వారా పరీక్షించి, కొందరికి కరోనా సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలో జులై మొదటి వారం నుంచి యాంటీజెన్‌ పరీక్షలు మొదలయ్యాయి. వీటి ద్వారా అర గంటలోగానే ఫలితం తెలుస్తోంది.

తాజాగా 1,316 కేసులు నమోదు

రాష్ట్రంలో పది రోజుల నుంచి కరోనా కేసులు 2వేలలోపే నమోదవుతున్నాయి. గురువారం 1,316 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 75,615 నమూనాలను పరీక్షించగా 1.75% మందికి వైరస్‌ సోకింది. 11 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 94,08,868 నమూనాలను పరీక్షించగా.. 8,58,711 (9.12%) పాజిటివ్‌ కేసులను గుర్తించారు. బాధితుల్లో 8,35,801 (97.33%) మంది కోలుకున్నారు. 16,000 మంది చికిత్స పొందుతున్నారు. 6,910 (0.80%) మంది మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

* తమిళనాడులో కొత్తగా 1,707 మందికి కరోనా సోకగా మొత్తం బాధితులు 7,64,989కి పెరిగారు. రోజు వ్యవధిలో 19 మంది మృతిచెందగా మృతుల సంఖ్య 11,550కి చేరింది.

* కర్ణాటకలో కొత్తగా 1,849 కేసులను గుర్తించారు. రాష్ట్రవ్యాప్త కేసులు 8,67,780కి పెరిగాయి. తాజాగా 26 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 11,604కు చేరుకుంది.

* తెలంగాణలో కొత్తగా 1,058 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కేంద్ర మంత్రి సదానందగౌడకు పాజిటివ్‌

తనకు కరోనా సోకినట్లు కేంద్ర మంత్రి డి.వి.సదానందగౌడ గురువారం ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నానని, వారం రోజులుగా తనను కలుసుకున్న వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: నేడు ప్రారంభం కానున్న పన్నెండేళ్ల పండగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.