ETV Bharat / city

రాష్ట్రంలో 5 జిల్లాల్లో ఎక్కువగా కరోనా తీవ్రత - ఏపీలో కరోనా కేసుల సంఖ్య

రాష్ట్రంలోని 5 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మరోసారి కేసులు 4వేలు దాటగా.. 18మంది అసువులు బాశారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ డోసులు ఎక్కువగా వచ్చిన వేళ.. ఒకేరోజు 6లక్షలకు పైగా టీకాలు వేశారు. ప్రజలు ఉత్సాహంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో పాల్గొంటుండగా.. మరిన్ని డోసులు రావాల్సి ఉంది. కొవిడ్‌ వ్యాప్తి, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ ఇవాళ సమీక్షించనున్నారు.

corona cases
corona cases
author img

By

Published : Apr 15, 2021, 8:21 AM IST

రాష్ట్రంలో 5 జిల్లాల్లో ఎక్కువగా కరోనా తీవ్రత

రాష్ట్రంలో మరో 4 వేల 157మందికి కరోనా సోకింది. 18 మంది మహమ్మారికి బలయ్యారు. తూర్పుగోదావరి, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 28 వేల 383 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. కరోనా బారిన పడ్డ గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని.. ఆమె కార్యాలయం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఎమ్మెల్యేకు కరోనా నిర్ధారణ కాగా.. 2 రోజులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఊపిరితిత్తుల సమస్య వల్ల కొంత ఇబ్బంది తలెత్తగా.. మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు కార్యాలయం వెల్లడించింది.

బుధవారం రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 6 లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటివరకు ప్రతిరోజూ 1.25 లక్షల మందికి పంపిణీ జరగ్గా.. ఒకేరోజు 6 లక్షల డోసుల పంపిణీ రికార్డుగా నిలిచింది. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే అత్యధికంగా 2 లక్షలకు పైగా టీకాలు వేశారు. టీకా ఉత్సవం చివరి రోజు కావడం సహా, ప్రజల నుంచి మంచి స్పందనతోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. నాలుగైదు రోజులుగా టీకాలు లేక చాలా మంది వెనుదిరిగి వెళ్లారు. కేంద్రం నుంచి మళ్లీ వ్యాక్సిన్ వస్తేనే టీకాల పంపిణీ ఉద్ధృతం చేసేందుకు వీలు కలగనుంది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం కరాలపాడులో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ సందర్శించారు. రిజిస్ట్రేషన్, వాక్సినేషన్‌, అబ్జర్వేషన్‌ గదులను పరిశీలించిన ఆయన.. టీకా చేయించుకున్న వారితో మాట్లాడారుం. వ్యాక్సిన్‌ కేంద్రాలకు నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గుంటూరు సర్వజనాస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, అవసరమైన సదుపాయాలపై జాయింట్ కలెక్టర్ ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్, పడకల కొరత లేకుండా చూడాలన్నారు.

త్వరలోనే సిబ్బంది సంఖ్య పెంచేలా నియామకాలు చేపడతామన్నారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులు, సాధారణ రోగులకు ఒకేచోట ఔషధాలు పంపిణీ చేస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిర్యాదులపై స్పందించిన అధికారులు.. రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆర్డీవో శేషిరెడ్డి పరిశీలించారు. విశాఖలో టీకా పంపిణీని మహానగర పాలక సంస్థ వేగవంతం చేసింది. మెగా శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు అందిస్తున్నారు.

రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచే అంశంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున నిరోధక చర్యలపైనా చర్చించనున్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక చర్యలపైనా సమీక్షించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కలకలం రేపుతున్న అన్నదమ్ముల గూఢచర్యం కుట్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.