కొత్తగా తెలంగాణలో మరో 228 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 152 మంది బాధితులు కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 యాక్టివ్ కేసులున్నాయి. 795 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నూతనంగా 46 కేసులు బయటపడ్డాయి.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
ఇదీ చూడండి :