‘సాక్షి’ మీడియాపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు వెల్లడించకముందే జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసినట్లు గత నెల 24న సాక్షి మీడియా ట్వీట్ చేసిందని రఘురామ వాదించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తను ట్వీట్ చేసిన సాక్షి సీఈవో, ఎడిటర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉద్దేశ్యపూర్వకంగా ట్వీట్ చేయలేదని, ఓ ఉద్యోగి పొరపాటు వల్ల జరిగిందని... సాక్షి మీడియా వివరించింది. కొద్దిసేపటికే ట్వీట్‌ను సవరించినట్లు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు... కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.
ఇదీ చూడండి: జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరణ