AMARAVATHI: హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతిలో రైతుల ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు ఎట్టకేలకు అధికారులు కదిలారు. సోమవారం జోన్-4లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నిధుల కొరత దృష్ట్యా తొలుత రూ.192.52 కోట్ల విలువైన పనులు మొదలుపెట్టి, దశల వారీగా చేపట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది. అనంతవరం, పిచ్చుకులపాలెం, దొండపాడులోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్‌లోకి వస్తాయి. ఇందులో మొత్తం 4వేలకు పైగా రైతుల ప్లాట్లు ఉన్నాయి. ఈ జోన్‌లో ఎల్పీఎస్, బృహత్ ప్రణాళికలోని ప్రాంతం 1,358 ఎకరాలు ఉంది. ప్రాధాన్యం మేరకు తొలుత రహదారులు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, తాగునీరు, వరద నీటి కాలువల వంటి వసతులు కల్పించనున్నారు. ఇవి కొలిక్కి వచ్చాక రుణం తీసుకుని మిగిలిన ప్యాకేజీల పనులూ ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నారు.
ఇవీ చదవండి: