ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి రిలీవ్ విషయంలో సస్పెండైన ఏఎస్ జయరాం, ఎస్వో అచ్చయ్యకు ఊరట లభించింది. జయరాం, అచ్చయ్యలపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించింది. వెంకయ్య చౌదరిని జయరాం, అచ్చయ్యలు ఉద్దేశపూర్వకంగా తప్పిదం చేయలేదని జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి శశిభూషణ్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 20 రోజుల సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
రాజధాని రైతుల పిటిషన్పై విచారణ: సీఎం సహా.. రాజకీయ నేతలకు హైకోర్టు నోటీసులు