ETV Bharat / city

ఎంపికైనట్లు చెప్పి... వెంటనే అనర్హులన్నారు - grama, ward posts

ఉద్యోగాలకు ఎంపికైనట్టు నియామక పత్రాలు ఇచ్చి వెంటనే విధుల్లో చేరాలని చెప్పటంతో వారు ఆనందపడ్డారు. అయితే రోజుల వ్యవధిలోనే ఆ ఉద్యోగానికి అనర్హులని చెప్తూ నిరాశపరిచారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని కొన్ని పోస్టుల నియామకంలో విద్యార్హత విషయంలో గందరగోళం తలెత్తటం వలన పదుల సంఖ్యలో అభ్యర్థులు నైరాశ్యంలో కూరుకుపోతున్నారు.

సచివాలయం
author img

By

Published : Oct 13, 2019, 6:35 AM IST

ఎంపికైనట్లు చెప్పి... వెంటనే అనర్హులన్నారు

వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. కడప జిల్లాలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 50మంది అనర్హులుగా అధికారుల నుంచి సమాచారం అందటంతో వారు నిర్ఘాంతపోయారు. నియామక పత్రాలు అందుకున్న రెండు రోజులకే బీకాం అర్హత ఉన్న వారు ఈ పోస్టుకు అర్హులు కాదని అధికారులు వారికి సమాచారమందించారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని తమకు జిల్లా అధికారులు సూచిస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టుకు అనర్హులుగా అధికారులు చెప్తున్నవారి సంఖ్య 800 మంది వరకూ ఉండొచ్చంటున్నారు.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతల్లో బీకాం కూడా భాగమేనని ఇప్పుడు ఆ డిగ్రీ ఉన్నవారు అనర్హులనడమేంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నియామక పత్రాలు అందినవారిని అనర్హులుగా ఓ వైపు ప్రకటిస్తున్నా ఇంకా చాలా మందికి నియామక పత్రాలూ అందలేదని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు.

Intro:ap_knl_23_12_dayalisis_building_abb_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో దయాలిసిస్ విభాగంలో సమస్యలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా గదిలోని ఏసీలు పని చేయడం లేదు. వీటి కారణంగా చెమటతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రంలో రోజు 35 మంది రోగులు దయాలిసిస్ చేయఁచుకుంటారు. ఏసీల మరమ్మతులకు ఆధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గాలి లేక రోగులు నరక యాతన పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని రోగులు విన్నవిస్తున్నారు. దయాలిసిస్ కేంద్ర భవనం పై భాగం పాడైపోయింది. అందులో నుంచి నీటి చుక్కలు పడి ఇబ్బందికర పరిస్థితి వుంది. అధికారులు స్పందించి దయాలిసిస్ విభాగంలో వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బైట్, భాష, దయాలిసిస్ చేయించుకొనే వ్యక్తి
బైట్, బాలు, ఇంచార్జీ, డయాలిసిస్ విభాగం

Body:డయాలిసిస్ విభాగంలో సమస్యలు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.