ETV Bharat / city

భూముల రీ సర్వేలో గందరగోళం.. సమస్యలను పరిష్కరించడంలో ఉన్నతాధికారుల ఉదాసీనం

రీ సర్వేలో రైతుల ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. వెబ్‌ల్యాండ్‌/ఆర్‌ఓఆర్‌లో ఉన్న ప్రకారం భూముల విస్తీర్ణానికి, వాస్తవంగా ఉన్న భూమికి తేడాలున్నాయి. ఇన్నాళ్లూ తమ హక్కు భుక్తంలో ఉన్న భూమి రీ సర్వేలో తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం తొలుత భూమి పాత హద్దులను గుర్తించి సర్వే నంబరులో ఉన్న భూమి విస్తీర్ణం ప్రకారం సబ్‌ డివిజన్‌ చేయాలి. అనంతరం సర్వే చేసి, ప్రతి ఒక్కరికీ హద్దులు చూపించాలి. వాటిపై వచ్చిన అప్పీళ్లను విచారించి పరిష్కరించిన తరువాత సర్వే రాళ్లు పాతాలి. కానీ.. ఉన్నతాధికారులు దీనిపై శ్రద్ధ చూపడంలేదు. ఈ ప్రక్రియపై రైతుల్లోనూ పూర్తి అవగాహన లేదు. దీంతో తాత ముత్తాతల కాలం నుంచి తమ ఆధీనంలో ఉన్న భూమి విస్తీర్ణం తగ్గినట్లు సర్వే సిబ్బంది చెబుతుంటే మండిపడుతున్నారు.

భూముల రీ సర్వేలో గందరగోళం.. సమస్యలను పరిష్కరించడంలో ఉన్నతాధికారుల ఉదాసీనం
భూముల రీ సర్వేలో గందరగోళం.. సమస్యలను పరిష్కరించడంలో ఉన్నతాధికారుల ఉదాసీనం
author img

By

Published : Jun 2, 2022, 4:52 AM IST

భూముల రీ సర్వే గందరగోళంగా మారింది. రైతులకు ఏమాత్రం భరోసా దక్కట్లేదు. పలువురు రైతులకు భూమి విస్తీర్ణం తగ్గుతోంది. గత 50, 60 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూముల విస్తీర్ణం తగ్గిందని సర్వే, రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాస్‌ పుస్తకాలు, డాక్యుమెంట్లలో ఉన్న భూమికి, సర్వేలో చెప్పేదానికి కొన్నిచోట్ల సంబంధం ఉండటం లేదు. కొలతల్లో తేడాలు రావడంతో రైతుల మధ్య మనస్పర్థలూ వస్తున్నాయి. గ్రామ సచివాలయాల్లో ఉన్న సర్వే, రెవెన్యూ సిబ్బంది రైతుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారం గురించి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేలబావులు, ఉమ్మడిదారులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో భూ సేకరణ జరిగిన పొలాల దగ్గర మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత హక్కు- భూరక్ష పథకం కింద భూముల రీ సర్వే జరుగుతోంది.

.

రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో, కొలతలు తుది దశకు చేరుకున్న గ్రామాల్లో పరిస్థితిని ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ ప్రతినిధులు పరిశీలించారు. తొలి విడతలో 51 గ్రామాల్లో రీ సర్వే పూర్తయి నెలలు గడిచిపోతున్నా... ఆన్‌లైన్‌ అడంగల్‌లో పాత సర్వే నంబర్లు, పాత విస్తీర్ణాలే కనిపిస్తున్నాయి. రైతులకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు. దీంతో భూముల క్రయ, విక్రయాలు ఏ రికార్డుల ప్రకారం చేస్తారో తెలియట్లేదు. రీ సర్వే పూర్తయినా, చాలాచోట్ల హద్దు రాళ్లు నాటలేదు. రైతులే నాటుకోవాలని సిబ్బంది చెబుతున్నారు.

తగ్గిన భూమి చూపించలేదు..

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం శివరామపురం వాసి పి.శ్రీనివాసులుకు 2.4 ఎకరాల భూమి ఉండగా.. రీ సర్వే తర్వాత దాన్ని 1.97 ఎకరాలుగా చూపించారు. పొలం పది సెంట్ల వరకు తగ్గిందని రాయి పాతారుగానీ, ఆ మేరకు భూమి సర్దుబాటు చేసి చూపించలేదు. అధికారులు ఇచ్చిన పత్రాలకు అనుగుణంగా గట్లు మార్చేందుకు పక్క పొలాల రైతులు అంగీకరించట్లేదు.

.

బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు..

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చొల్లంగిపాలెంలో 54.78 ఎకరాల భూమిని రెండేళ్ల పాటు సర్వే చేశారు. 60 మంది రైతులకు చెందిన 24.61 ఎకరాల పల్లం భూములు, 2.30 ఎకరాల మెట్ట భూములతోపాటు 17.87 ఎకరాల పోరంబోకు స్థలాన్ని డ్రోన్‌తో సర్వేచేసి ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) నంబర్లను సృష్టించారు. సర్వే సమయంలో కొందరు భూములు కోల్పోగా మరికొందరికి అదనంగా కలిసొచ్చింది. సర్వే పూర్తయి 6 నెలలు దాటినా ఇప్పటికీ తమకు పాస్‌పుస్తకాలు ఇవ్వలేదని, ఆన్‌లైన్‌లో 1బీ, అడంగల్‌ వివరాలూ లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని కాళ్ల రమణ అనే రైతు వాపోతున్నారు. ఈ గ్రామ ఎల్‌పీఎం నంబర్లను సచివాలయానికి అనుసంధానం చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.

* నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వురుపాడులో రీ సర్వే సమయంలో అదనంగా భూమి ఉందని తేల్చి పక్క వారికి కలిపారు. దీంతో రైతులు విభేదించి మళ్లీ రీ సర్వే చేయాలంటున్నారు.

వ్యత్యాసాలపై రైతుల ఆవేదన..

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌ అక్కంపేటలో రీ సర్వే తర్వాత కొందరికి భూవిస్తీర్ణం తగ్గి, మరికొందరికి పెరిగింది. ఇక్కడ సెంటు భూమి ఖరీదు రూ.లక్ష. ‘విశ్వనాధుని కండ్రిగ అగ్రహారంలో డొంకరోడ్లు అక్రమణలకు గురై.. రైతులు ఇబ్బంది పడుతున్నారు. రీ సర్వేలో డొంకరోడ్డునూ లెక్క తేల్చి హద్దు రాళ్లు పాతాలి’ అని పల్నాడు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన ఎం.కృష్ణ పేర్కొన్నారు.

2016 సర్వేలో లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చింది?..

‘2016లో ప్రభుత్వ సర్వేయర్‌తోనే సర్వే చేయించా. అప్పుడు సమస్య రాలేదు. నా భూమి నా పరిధిలోనే ఉంది. రీ సర్వేలో 13 సెంట్ల వరకు తగ్గింది’ అని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వాసి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట, బందరు డివిజన్‌ బందరు మండలంలోని పొట్లపాలెం, నూజివీడు డివిజన్‌లో మర్రిబందం, గుడివాడ డివిజన్‌లో మెరకగూడెం గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో హద్దుల కేటాయింపులో ఇంకా సమస్యలు అలానే ఉన్నాయని రైతులు చెబుతున్నారు.

.

తెలియకుండా హద్దు రాళ్లు నాటారు..

‘కొండ జాగర్లమూడి పరిధిలోని సర్వే నంబరు 26లో మాకు 16 ఎకరాల భూమి ఉంది. రీ సర్వే సందర్భంగా 10 సెంట్లు తగ్గింది. మాకు సంబంధించిన పదెకరాల్లో 6 సెంట్లు తగ్గించుకుంటామని చెప్పాం. ఒకవైపు ఎన్నెస్పీ కాలువ భూమి ఉంటే అందులో పది సెంట్ల భూమిని కలిపి హద్దు రాళ్లు నాటారు. ప్రభుత్వ భూమి వద్దని, మా భూమిలోనే తగ్గించుకుంటామని చెప్పినా అలా చేయలేదు. దీనివల్ల అందరి గట్లు మారుతున్నాయి. గట్టుకు 10 అడుగుల దూరంలో వీటిని నాటారు’ అని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన రాంబాబు తెలిపారు.

.

వారి భూముల్లోనే కొలతలు వేస్తున్నాం- శ్యాంప్రసాద్‌, సంయుక్త కలెక్టర్‌, పల్నాడు..

రీ సర్వే కోసం గుర్తించిన గ్రామాల్లో రైతుల సమక్షంలోనే కొలతలు వేసి విస్తీర్ణాలను నిర్ధారిస్తున్నాం. సమస్యలు వచ్చినచోట రైతులకు వివరిస్తున్నాం. హద్దు రాళ్లను ఉపాధి హామీ పథకం కింద రైతుల పొలాల్లో పాతుతున్నాం. కొందరికి భూముల విస్తీర్ణం పెరుగుతోంది.

.

ఆదేశాలకు అనుగుణంగానే రీ సర్వే - పార్థసారధి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, పల్నాడు..
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అనుసరించే రీ సర్వే జరుగుతోంది. రైతులకు ప్రతి దశపైనా అవగాహన కల్పిస్తున్నాం. డ్రోన్ల ద్వారా వచ్చిన ఛాయాచిత్రాలు, రోవర్ల ద్వారా భూముల యథాస్థితిని గుర్తిస్తున్నాం.

ఎసైన్‌మెంట్‌ భూముల్లో సమస్యలు తీవ్రం..

పేదలకు ఎసైన్డ్‌ భూములు ఇచ్చినప్పుడు ప్రభుత్వ భూమిని వ్యవసాయ భూమిగా మారుస్తూ ఉత్తర్వులివ్వాలి. అయితే.. ఇలా మార్చకుండా పేదలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. కన్వర్షన్‌ జరగనందున ఇది ప్రభుత్వ భూమిగానే రికార్డుల్లో ఉంది. ఈ కేసులు ఎక్కువగా చెరువు పోరంబోకు భూముల విషయంలో ఉన్నాయి. జల వనరుల స్థలాలను ఎసైన్‌ చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో రీ సర్వేలో వీటిని చెరువు పోరంబోకుగా చూపిస్తున్నారు.

పంపకాల్లో తేడాలు..

అన్నదమ్ముల పంపకాల్లో తేడాలు వస్తున్నాయి. ఒకరిద్దరు అంగీకరించినా... మిగిలినవారు అంగీకరించట్లేదు. తల్లిదండ్రులు వారిష్టం మేరకు రాసినా, సరిహద్దుల వివరాలు దస్తావేజుల్లో ఉండవు. రీ సర్వే సమయంలో రోడ్డుపక్కనే ఉండే స్థలాన్ని తనకు రాయాలని పట్టుబడుతున్నారు. కాగితాలు లేనందున సిబ్బంది దాన్ని ఉమ్మడిగా పెట్టేస్తున్నారు.

ఉమ్మడి బావుల విషయాల్లో...

సర్వే హద్దుల చట్టం ప్రకారం బావులను విభజించలేరు. ఈ బావుల్లో స్థల హక్కు విషయంలో వివాదాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో అవసరాలకు తగ్గట్లు ఉమ్మడి బావులున్నాయి. ఇప్పుడు లేవు. బావి స్థలంలో దూరంగా ఉన్న రైతులకు వాటా రావట్లేదు. అక్కడ సాంకేతికంగా హక్కు నిర్ధారించలేదు. బావికి ఖాతాదారుడు ఉండరు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలన్నదానిపై విధివిధానాలు స్పష్టంగా లేవు.

.

నేల బావిలో వాటా లేదంటున్నారు..- హరిబాబు, రైతు, యడ్లపాడు మండలం, పల్నాడు జిల్లా..

విశ్వనాధుని కండ్రిగ అగ్రహారంలో నాకు తాతల నుంచి సంక్రమించిన 2.25 ఎకరాల భూమి ఉంది. రీ సర్వేలో మూడు భాగాలుగా ఉన్న నా భూమిని సరిగా కొలవకపోవడంతో కొంత కోల్పోయాను. పక్కపొలంలో ఉమ్మడిగా 4 సెంట్లలో నేలబావి ఉంది. అందులో నాకు వాటా లేదని సర్వే సిబ్బంది చెప్పారు.

.

మేమే మాట్లాడుకుంటే సర్వే ఎందుకు?- సాంబశివరావు, రెంటపాళ్ల, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా

రీ సర్వే సమయంలో కొలతల సమస్యలు వస్తుంటే... మీరంతా కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సర్వే సిబ్బంది చెబుతున్నారు. అధికారులు నిర్ధారించాలిగానీ, రైతులే మాట్లాడుకుంటే రీ సర్వే ఎందుకు? నాకు ఎకరానికి 2-3 సెంట్ల భూమి తగ్గింది.

.

29 సెంట్లు తగ్గిస్తే ఎలా?
- తిరుపతయ్య, కొండ జాగర్లమూడి, గుంటూరు జిల్లా

కొండ జాగర్లమూడిలో సర్వే నంబరు 27-3లో మాకు 92 సెంట్ల భూమి ఉంది. రీ సర్వే చేసి మా అనుభవంలో ఉన్నది 63 సెంట్లేనని చూపిస్తున్నారు. ఇదేంటని అడిగితే మీ సాగులో ఉన్న భూమి అంతేనని చెబుతున్నారు. 3 దశాబ్దాలుగా గట్లు జరపలేదు. అయినా 63 సెంట్లే ఉందంటున్నారు. సర్వే నంబరులో 4 సబ్‌ డివిజన్లు ఉంటే ఒక దానిలోనే ఎలా తగ్గిస్తారని, రికార్డుల్లో ఎందుకు 92 సెంట్లు ఉందని ప్రశ్నిస్తే.. అధికారుల నుంచి సమాధానం లేదు.

భూముల వివరాలు కనిపించడం లేదు
అనకాపల్లి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ జరగని విషయాన్ని జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా రీ సర్వే చేసిన గ్రామం భూముల వివరాలు కనిపించడం లేదని, అందుకే రిజిస్ట్రేషన్‌ చేయలేకపోతున్నామని చెప్పారు. ఎన్‌ఐసీ వాళ్లకు చెప్పి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

ఎన్నెన్నో సమస్యలు

.

రీ సర్వేలో కొత్త సమస్యలు తెరపైకొస్తున్నాయి. దస్తావేజులు లేకుండా పూర్వార్జితం కింద నమోదైన కేసుల్లో మరిన్ని సమస్యలు వస్తున్నాయి. ఆర్‌ఓఆర్‌/వెబ్‌ల్యాండ్‌లో సర్వే నంబరుకు, విస్తీర్ణానికి మించి నమోదవుతోంది. వీరివద్ద దస్తావేజులు లేకపోవడంవల్ల వాస్తవ విస్తీర్ణం తేలట్లేదు. దీనివల్ల వారి విస్తీర్ణం తగ్గుతుండగా తామేమీ చేయలేమని సిబ్బంది చెబుతున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం మర్రిపాలెంలోని ఎన్‌ఎస్‌పీ కాలువ పోరంబోకులో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాల్వ కోసం భూసేకరణ జరిగింది. దాంతో పలువురి భూముల హద్దులు మారి, కొందరికి విస్తీర్ణాలు తగ్గగా, మరికొందరికి పెరిగాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎన్నెస్పీ కెనాల్‌ వారి పరిధిలో ఉందని చెబుతున్నారు. భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి, మిగులుభూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఇదీ చూడండి..

"కొత్తచోట నిర్మాణాలొద్దు.. పాత రిసార్ట్స్‌ ఉన్నచోటే కట్టుకోండి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.