Mulayam Singh: ములాయం సింగ్ యాదవ్ మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం సింగ్ మరణవార్త ఎంతో బాధించిందని అన్నారు. తనకు అత్యంత ఆప్తులు, సోదరుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారన్నారు. ములాయంతో కలిసి గతంలో పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. తన ఆలోచనలతో లక్షలమంది జీవితాలను మార్చిన నేత ములాయం అని కొనియాడారు. అఖిలేశ్ సహా కుటుంబసభ్యులకు, యూపీ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ములాయం సింగ్ యాదవ్ మరణానికి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సంతాపం ప్రకటించారు. ములాయం సింగ్ మరణవార్త ఎంతో బాధించిందని అన్నారు. మంచి దేశ నాయకుడిని కోల్పోయామన్నారు.
ములాయం సింగ్ యాదవ్ మృతికి తెదేపా నేత యనమల రామకృష్ణుడు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ములాయంసింగ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ములాయం వ్యక్తిత్వం దేశ రాజకీయాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చిందన్నారు. రాజకీయ సంస్కరణలో ఆయన సేవలను దేశం ఎన్నటికీ మరువదని అన్నారు.
ములాయం సింగ్ యాదవ్ మృతికి తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో సోషలిస్టు రాజకీయాల శకం ములాయం మరణంతో ముగిసిందని లోకేశ్ అన్నారు.
ములాయం సింగ్ యాదవ్ మృతికి కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంతాపం తెలిపారు. ములాయం మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. జాతీయ రాజకీయాల్లో ములాయం చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.
ఇవీ చదవండి: