గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తాత్కాలిక వీసీ ఆచార్య రాజశేఖర్‌పై ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ఆచార్య రత్నషీలామణి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయంలో సీనియర్ మహిళా ఆచార్యులని చూడకుండా... తనను అవమానాలకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గత నెల విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈసీ సభ్యులుగా ఉన్నా... తన పేరు వేయకుండా మరో ఇద్దరి ఈసీ సభ్యుల పేర్లు వేశారని లేఖలో తెలియజేశారు.
విశ్వవిద్యాలయంలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే కమిటీలలోనూ తన పేరును పరిశీలనలోకి తీసుకోకుండా ఒప్పంద అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి స్థానం కల్పిస్తున్నారని లేఖలో వివరించారు. పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు.
ఫిర్యాదుపై స్పందించిన ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...సమగ్ర వివరణ ఇవ్వాలంటూ తాత్కాలిక వీసీ ఆచార్య రాజశేఖర్‌ను ఆదేశించారు.
ఇదీ చదవండి