ETV Bharat / city

కరోనా కట్టడి... ప్రజా భాగస్వామ్యంతోనే సాధ్యం..

కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే పోయేలా లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధాని మోదీ సైతం ఇదే చెబుతున్నారు. అలాగని ఈ వైరస్‌ను పూర్తిగా నియంత్రించే అవకాశం లేదా? అంటే .. ఎందుకు చేయలేం.. అన్న సమాధానం వస్తుంది. ఐతే ఎలాంటి పనికైనా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది విజయవంతమవుతుంది. ఇప్పుడు కరోనాపై పోరులో కూడా అదే ముఖ్యమని అంటున్నారు నిపుణులు. ఎవరికి వారు.. వైరస్‌ అదుపు చేయడం మన చేతుల్లోనే ఉందన్న విషయం గుర్తుంచుకుంటే చాలు. స్వీయ రక్షణతోపాటు సామాజిక భద్రత గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే మనతోపాటు భవిష్యత్‌ తరాల వారు ఆరోగ్యవంతమైన జీవనం గడపగలరు.

కరోనా కట్టడి... ప్రజా భాగస్వామ్యంతోనే సాధ్యం..
కరోనా కట్టడి... ప్రజా భాగస్వామ్యంతోనే సాధ్యం..
author img

By

Published : Jul 14, 2020, 6:30 AM IST

కరోనాతో కంటిమీద కునుకులేదు. ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. వైరస్‌ సోకిన వారిని చూసి .. అయ్యో అని జాలిపడటం తప్ప చేయగలిగిందేం లేదు. దగ్గరి బంధువులే కాదు సొంత ఇంట్లోని వారికి సోకినా సాయం అందించలేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అనుకుంటూనే నిత్యం ఆందోళనతో బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగని జీవనపోరాటం కొనసాగించక తప్పదు . మొండిగా వైరస్‌ను ఎదుర్కోవలసిందే.

గాలి ద్వారా వచ్చే అవకాశం!

ఈ యుద్ధంలో గెలవాలంటే ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉంటే చాలదు. ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు కరోనాపై పోరాటం ఇప్పట్లో ముగిసేది కాదు. అయితే శతాబ్దకాలంలో కనీవినీ ఎరగని ఆరోగ్య సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రజల నుంచి స్పందనే ఆందోళన కలిగిస్తోంది. గట్టిగా తుమ్మితే, దగ్గితే వచ్చే పెద్ద తుంపర్లతోనే కరోనా వైరస్‌ ఇతరులకు సోకుతుందని ఇప్పటిదాకా చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మాట్లాడినప్పుడు వచ్చే సూక్ష్మతుంపర్లతోనూ ముప్పు తప్పదంటోంది. గాలి ద్వారానూ వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని గుర్తించడం కొత్త ఆందోళనకు కారణమైంది.

స్ఫూర్తికి తూట్లు

ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరాటంలో భారత్‌ ప్రజల భాగస్వామ్యాన్ని కేంద్ర బిందువుగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దగ్గు, తుమ్ములద్వారా ఒకరినుంచి మరొకరికి కరోనా వ్యాపించకుండా కట్టడిచేసే లక్ష్యంతోనే లాక్‌డౌన్‌ విధించారు. ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, మ్యూజియాలు, వ్యాయామశాలలు తదితరాల్ని మూసివేతకు ప్రధాన కారణమదే. ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కొన్నాళ్లుగా జనసామాన్యంలో నిబంధనల ఉల్లంఘన ఎక్కువవుతోంది. ముందుగా అలాంటి లోపాలను సరిదిద్దుకోవాలి.

ఉల్లంఘనల వల్లే

భౌతికదూరం పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు, అవసరం లేనిదే ఇంటి నుంచి బయటకు రావొద్దు, పార్టీలు, వేడుకల వద్దని పదేపదే చెబుతున్నా పట్టించుకునే వారేరి. ఇలాంటి ఉల్లంఘనల వల్లే చాలామంది ప్రాణాలమీదకు వస్తోంది. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయినవారిలోనూ కొంతమంది రోడ్లపై తిరుగుతున్నారని, అటువంటివారూ మాస్కులు ధరించకుండా తిరగడం వల్లే.. వైరస్‌ వ్యాప్తి జోరందుకోడానికి ముఖ్యకారణంగా కనిపిస్తోంది.

సమూహ వ్యాప్తిని అడ్డుకోవాలంటే

మొదట్లోనే... కరోనాపై పోరాటానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లాంటి జనసాంద్రత అధికంగా దేశంలో అది తప్పనిసరని పేర్కొంది. వైరస్‌ సమూహ వ్యాప్తి దశలో రాకుండా ఉండేందుకు ప్రజల భాగస్వామ్యంతోనే అడ్డుకోగలమని తెలిపింది.

భయం వద్దు

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు భారత్‌ తనదైన పద్ధతులు ఎంచుకోవాలని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ సీడీడీఈపీకు చెందిన నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతర దేశాలకు పూర్తిగా భిన్నమైన పద్ధతులు అనుసరించాలని అంటున్నారు. ముఖ్యంగా భయం నుంచి బయటపడాలి. ఈ వైరస్‌ సోకినవారిలో 98% కోలుకుని సురక్షితంగా ఉంటారు. అయితే నివారణ చర్యలు, వైద్య సదుపాయాల పెంపు, పరిశుభ్రత విషయంలో స్థానిక సంస్థలతో సహా అందరినీ భాగస్వాములు కావాలి. అప్పుడే వైరస్‌పై విజయం సాధించగలుతాం. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ ఎత్తివేసి నిబంధనలు సండలించడం వల్ల పరిస్థితులు అదుపులో లేవు. ఇప్పుడే ప్రజలు మరింత ధైర్యంగా ఉండి తమవంతు భాగస్వామ్యం అందించాలి.

ఇదీ చదవండి : ప్రభుత్వ మాటలు బ్రహ్మాండం.. చేతలు శూన్యం..: పీసీసీ నేత తులసిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.