రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీరణకు కమిటీ ఏర్పాటైంది. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ దృష్టి సారించనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా సీసీఎల్ఏ, జీఏడీ సర్వీసెస్ కార్యదర్శితో పాటు, ప్రణాళికా శాఖ కార్యదర్శి.. సీఎంవో అధికారిని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కమిటీ కన్వీనర్‌గా ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు.
13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటుకు గతంలోనే కేబినెట్ తీర్మానించింది. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
కమిటీ అధ్యయన అంశాలివే..!
- ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులను ఉపయోగించుకుంటూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొత్త జిల్లాలు ఎలా పనిచేయాలి.
- ఉన్న మానవ వనరుల విభజన.. కొత్త జిల్లాలకు పంపండం.. వీరితోనే కొత్త జిల్లాల నిర్వహణ.
- ప్రస్తుతం ఉన్న వివిధ శాఖల పాత్ర, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా అంతకన్నా దిగువకు ఆయా స్థాయిల్లో ఎవరి విధులు ఏమిటి..? ఎవరి బాధ్యతలు ఏమిటో నిర్వచించడం. పాలన వికేంద్రీకరణ, జిల్లాల పునర్వవస్థీకరణ దృక్పథంతో దీన్ని నిర్వచించాలి.
- ఈ మార్పులు సజావుగా సాగేందుకు చేయాల్సిన ఖర్చులు వీలైనంత తగ్గించడం ఎలా..?
- ఈ క్రమంలో ఒకసారి, మళ్లీమళ్లీ చేయాల్సిన ఖర్చులు వీలైనంతగా తగ్గించడం ఎలా..?
- జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు భౌగోలికంగా, పాలనాపరంగా అనుసరించాల్సిన సూత్రాలపై సూచనలు చేయాలి.
ఇదీ చదవండి..