ETV Bharat / city

Santhosh babu: కల్నల్‌ సంతోశ్‌బాబు వీరమరణానికి ఏడాది! - colonel Santhosh babu statue

గాల్వన్‌ లోయ ఘర్షణలో కల్నల్‌ సంతోష్‌బాబు అసువులు బాసి నేటికి ఏడాది పూర్తవుతోంది. సంతోష్‌ బాబు వీరమరణం.. ఆయన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అయినా వారి గుండెల్లో బాధ కన్నా గర్వమే ఎక్కువగా కనబడుతోంది. కుమారుడిని పోగొట్టుకోవడం మాయని గాయమే అయినా.. దేశం కోసం పోరాడి.. ప్రజల మనసుల్లో చిరస్థానం సంపాదించుకుని.. తమ కుమారుడు అమరుడిగా నిలిచాడని చెమ్మగెల్లిన కళ్లతో తల్లిదండ్రులు చెబుతున్నారు.

Colonel Santoshbabu
కల్నల్‌ సంతోశ్‌బాబు
author img

By

Published : Jun 15, 2021, 10:03 AM IST

కల్నల్‌ సంతోశ్‌బాబు

చైనా దాష్టీకానికి ఎదురు నిలబడి.. డ్రాగన్‌ సైనికులతో పోరాడి అసువులు బాసిన కల్నల్‌ సంతోష్‌ బాబు.. ఏడాదైనా ప్రజల గుండెళ్లో మెదులుతూనే ఉన్నారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోశ్‌బాబు చిన్ననాటి నుంచే తండ్రి ఉపేందర్ ప్రోత్సాహంతో సైన్యంలో చేరడమే లక్ష్యంగా చదివారు. కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తైన తర్వాత.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. ఆ తర్వాత ఇండియన్‌ మిలటరీ అకాడమీలో సైనిక శిక్షణపూర్తి చేసుకుని ఆర్మీ విధుల్లో చేరారు. 15 ఏళ్ల సర్వీసులో దేశ రక్షణ కోసం అంకితభావంతో పనిచేశారు. 2007లో పాకిస్థాన్ బోర్డర్‌లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించి దేశ రక్షణలో భాగస్వామ్యమయ్యారు. 2020 జూన్‌ 15 తెల్లవారు జామున రెచ్చిపోయి తెగబడిన చైనా సైనికులకు కొదమసింహంలా ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందారు.

తాను పుట్టిన దేశం కోసం అంటూ ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు... తనను కన్నవాళ్లకు మాత్రం తీరని ఆవేదనను మిగిల్చారు. కానీ.. కుమారుడిని పోగొట్టుకున్న ఆ క్షణం వారి కళ్లలో బాధను మించిన గర్వం కనిపించింది. ప్రభుత్వం, ప్రజలు మీకు మేమున్నామంటూ వారి కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు. శత్రు సైనికులకు వెన్ను చూపక పోరాడిన సంతోశ్‌బాబును.. కేంద్ర ప్రభుత్వం మహావీరచక్ర అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వం ఆయన కుటుంబానికి గౌరవనీయమైన స్థాయిలో ఆర్ధిక సహకారం అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వారిని పరామర్శించారు. సూర్యాపేట కోర్టు చౌరస్తాలో సంతోష్ బాబు విగ్రహం ఏర్పాటు చేసి.. సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు.

తమ కుమారుడు దూరమై ఏడాది గడిచిందంటే నమ్మలేక పోతున్నామని.. సంతోశ్‌బాబు తల్లిందండ్రులు తమ బాధను పంచుకున్నారు. తల్లిదండ్రులుగా తమ దుఃఖం తీరనిదైనా.. ప్రజల్లో సంతోశ్‌బాబు ఎప్పటికీ బతికే ఉంటారని గర్వంగా చెబుతున్నారు. సంతోశ్‌బాబు స్ఫూర్తితో సైనికులయ్యే ప్రతి ఒక్కరిలోనూ.. తమ కుమారుడినే చూసుకుంటామని అన్నారు.

కల్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం పొందేనాటికి ఆయనకు భార్య సంతోషి, తొమ్మిదేళ్ల కుమార్తె అభిజ్ఞ, నాలుగేళ్ల కుమారుడు అనిరుధ్ ఉన్నారు. కల్నల్‌ మరణంతో ఆయన భార్యపై ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు పడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగానికి శిక్షణలో ఉన్న సంతోషి.. భర్త జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నానని తన మనోవేదన పంచుకున్నారు. దశాబ్దాలు గడిచినా సంతోశ్‌ బాబు ప్రజల మనసుల్లో ఎప్పటికీ బతికే ఉంటారు. ఆయన వీరత్వం, త్యాగం, దేశభక్తి ఎంతో మంది యువకుల్లో స్పూర్తి నింపుతూనే ఉంటాయి.

ఇదీ చూడండి:

RaghuRama letter to Jagan: సీఎంకు ఎంపీ రఘురామ ఆరో లేఖ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.