ETV Bharat / city

కలెక్టర్లు రంగంలోకి దిగాలి: కె.ఎస్ జవహర్ రెడ్డి

author img

By

Published : Apr 21, 2021, 10:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉందని.. కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఛైర్మన్ జవహర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ప్రాథమిక కాంటాక్టులకు పరీక్షలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. కొవిడ్ కేర్ సెంటర్లు, పడకలు సంఖ్యనూ పెంచాలని ఆదేశాలు ఇచ్చారు.

కె.ఎస్ జవహర్ రెడ్డి
కె.ఎస్ జవహర్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక కాంటాక్టు పరీక్షలు తక్షణమే పూర్తి చేయాలని.. కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఛైర్మన్ కె.ఎస్. జవహర్ రెడ్డి ఆదేశించారు. పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొవిడ్ నిర్ధారణకు ట్రునాట్ టెస్టులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టెస్టులను పెద్ద సంఖ్యలో చేపట్టాల్సిందేనని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడితే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని.. కొవిడ్ వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని హెచ్చరించారు. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా కలెక్టర్లు రంగంలోకి దిగాలని జవహర్ రెడ్డి ఆదేశించారు. కరోనా పరీక్షలు, చికిత్స, మౌలిక సదుపాయాల కల్పన కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొవిడ్ కేర్ సెంటర్లను తక్షణం అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19 వేల పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. మరో 19 వేల పడకలు అందుబాటులోకి తేవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఫిర్యాదులు, సమాచారం కోసం ఉద్దేశించిన 104 కాల్ సెంటర్ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. 104కు వచ్చే ప్రతి కాల్​నూ సంబంధిత అధికారులకు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండీ... తితిదే ఈవో జవహర్ రెడ్డికి.. కొవిడ్ కంట్రోల్ కేంద్రం బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.