ETV Bharat / city

మహానగరాలకు దీటుగా.. మన దగ్గరే వైద్యం! - సీఎం సమీక్ష

14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి జగన్.. వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మహానగరాలు లేవు. అక్కడున్న సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులూ ఇక్కడ లేవని.. ఈ పరిస్థితిని మార్చేందుకు  ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : Jun 1, 2021, 6:35 AM IST

రాష్ట్రంలో దాదాపు రూ.8 వేల కోట్లతో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాడేరు, పులివెందులలో ఇప్పటికే భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 14 వైద్య కళాశాలల భవనాలకు ముఖ్యమంత్రి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమహేంద్రవరం, పాలకొల్లు, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోని వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.

"రాష్ట్రంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మహానగరాలు లేవు. అక్కడున్న సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులూ ఇక్కడ లేవు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి బోధనాసుపత్రికి 500 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులో ఉంటుంది. ప్రతి పేదవాడికి సమీపంలోనే మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే గొప్ప కార్యక్రమం ఇది" అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘ప్రైవేటు రంగంలో రూ.100 కోట్ల పెట్టుబడితో జిల్లా కేంద్రాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను మూడేళ్లలో ఏర్పాటు చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా 5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇలా ప్రైవేటు రంగంలో 80 నుంచి 90 సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయి’ అని వివరించారు.

రూ.16,300 కోట్లతో ఆసుపత్రులకు కొత్త రూపు

రూ.16,300 కోట్లతో రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులను సమూలంగా మార్చివేస్తున్నాం. 10,111 వైఎస్సార్‌ గ్రామ క్లినిక్‌లు, 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్కులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులను ‘నాడు- నేడు’లో పూర్తిగా మార్చి వేసి జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. అయిదు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం.

కేంద్ర సాయం అందనివారి కోసం..

రాష్ట్రంలో కొవిడ్‌ రోగులకు సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌ మరణిస్తే రూ.5 లక్షల సాయం అందిస్తాం. కేంద్ర సాయం పరిధిలోకి రానివారికి ఇది అందుతుంది. కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బందీ దీనికి అర్హులే. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అందించే సహాయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చాక నిర్ణయం తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

చరిత్రాత్మక నిర్ణయం

ఒకేసారి ఇన్ని వైద్యకళాశాలలు, నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటు చరిత్రాత్మక నిర్ణయమని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. దేశచరిత్రలో ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. వైఎస్‌ హయాంలోనే వైద్య, ఆరోగ్య రంగంలో కొంత అభివృద్ధి జరిగిందని, తర్వాత మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు ఎవరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.

వైద్య రంగంపై మీ దూరదృష్టి బాగుంది: డాక్టర్‌ శరత్‌చంద్ర

పల్నాడు ప్రాంతానికి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తర్వాత దక్కిన అతి పెద్ద ప్రాజెక్టు వైద్యకళాశాలేనని పిడుగురాళ్లకు చెందిన డాక్టర్‌ శరత్‌చంద్ర అన్నారు. వైద్య రంగంపై ముఖ్యమంత్రికి ఉన్న విజన్‌ బాగుందని ప్రశంసించారు. విజయనగరం జిల్లాలో సరైన వైద్య సదుపాయాలు లేక వేరే రాష్ట్రాలకు వెళ్లవలసి వచ్చేదని, ఇప్పుడు తమకు దగ్గర్లోనే ఇంత మంచి సదుపాయాలు కల్పించడం ఆనందంగా ఉందని కృష్ణవేణి అనే మహిళ సీఎంతో అన్నారు. తన భర్తకు కరోనా సోకిందని 104కు ఫోన్‌ చేస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించి, ప్రాణాలు నిలబెట్టారని విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన జయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా జిల్లాల్లో శంకుస్థాపనలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, అధికారులు ఎంటీ కృష్ణబాబు, కాటమనేని భాస్కర్‌, ఎ.బాబు, ఎ.మల్లికార్జున్‌, వి.విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.

2023 డిసెంబర్‌కల్లా అందుబాటులోకి...

‘బ్రిటిష్‌ కాలం నుంచి చూసినా మన రాష్ట్రంలో 11 వైద్యకళాశాలలే ఉన్నాయి. కొత్తగా 16 వైద్య, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రానికీ తీసిపోని విధంగా మన రాష్ట్రమూ తయారవుతుంది. కొత్త ఆస్పత్రులన్నీ ఆరోగ్యశ్రీకి అనుసంధానమై ఉంటాయి. ప్రతి నిరుపేదకు వారి గడప వద్దకే వైద్య సహాయం తీసుకువచ్చేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని 2023 డిసెంబర్‌ నాటికి వీటిని అందుబాటులోకి తెస్తాం. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రుల్లో 10 ఆధునిక ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూలు, ఆక్సిజన్‌ పైపులతో అనుసంధానం చేసే పడకలు, ఆక్సిజన్‌ ట్యాంకులు, ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి. ప్రతి ఆస్పత్రినీ జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తాం.

ఇదీ చదవండి:

రాష్టంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.