తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. వైద్యారోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఇంకా మహమ్మారి నియంత్రణలోకి రాలేదన్న సీఎం.. వైరస్ వ్యాప్తికి కారణాలను అధ్యయనం చేయాలని సూచించారు.
నూతన మార్గాలను అన్వేషించాలి..
ఏ వేరియంట్ ఎప్పుడు వస్తుందో ఎవరూ గుర్తించలేకపోతున్నారన్న కేసీఆర్... ఇతర రాష్ట్రాల్లోని కట్టడి చర్యలు అధ్యయనం చేసి నూతన మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో వైద్య బృందం సరిహద్దు జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు. 3 రోజులు హెలికాప్టర్ ద్వారా వరుస పర్యటనలు చేపట్టి.. నివేదిక సిద్ధం చేసి కేబినెట్‌కు సమర్పించాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్న సీఎం.. ప్రజలందరూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారిందన్న సీఎం.. సంక్లిష్ట పరిస్థితుల్లోనే వైద్యారోగ్యశాఖ అప్రమత్తం కావాలని సూచించారు.
వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలి..
శాస్త్రీయ పద్ధతుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని.. కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో అధికారులు పర్యటించాలని దిశానిర్దేశం చేశారు. వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలని.. అన్ని విభాగాలతో సమీకృత భవన సముదాయంగా ఆస్పత్రి నిర్మించాలని ఆదేశించారు. వైద్య సేవలకు తూర్పు తెలంగాణ.. వరంగల్‌కు తరలేలా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: