ETV Bharat / city

KCR speech in trs plenary: ఏపీలో పార్టీ పెట్టాలని కోరుతున్నారు: కేసీఆర్

తెరాస పార్టీకి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ ఉందని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్​ రావు(KCR speech in trs plenary) అన్నారు. తమను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని గులాబీ దళపతి.. ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీ పెట్టాలని వేలాది మంది కోరుతున్నారని అన్నారు.

cm-kcr-said-that-andhra-pradesh-people-requested-to-form-trs-party-in-that-state
ఏపీలో మీ పార్టీ పెట్టండి.. గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు: కేసీఆర్
author img

By

Published : Oct 25, 2021, 1:50 PM IST

'ఆంధ్రప్రదేశ్‌లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటాం' అంటూ.. ఆ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయని తెరాస అధ్యక్షుడు(TRS PRESIDENT KCR), తెలంగాణ సీఎం కేసీఆర్‌(KCR speech in trs plenary) అన్నారు. దళిత బంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని కేసీఆర్‌ వెల్లడించారు. హైటెక్స్​లో తెరాస ప్లీనరీ సమావేశాలను ప్రారంభించిన గులాబీ దళపతి(KCR speech in trs plenary).. తెలంగాణ అభివృద్ధి, పార్టీ నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించారు.

ఏపీలో మీ పార్టీ పెట్టండి.. గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు: కేసీఆర్

ఏ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందదని అందరూ విమర్శించారో.. ఆ రంగాల్లోనే అగ్రస్థానంలో ఉన్నామని కేసీఆర్‌ అన్నారు. యావత్‌ దేశం రాష్ట్రం వైపు చూస్తోందని చెప్పారు. తెలంగాణలో తమను కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వస్తున్నాయని(KCR speech in trs plenary) కేసీఆర్‌ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌, కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాల ప్రజలు మన రాష్ట్రాల్లో కలవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు వచ్చి పనిచేస్తున్నారన్న కేసీఆర్‌.. ఈ ఏడున్నరేళ్లలో తెరాస ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వారి విజ్ఞప్తులకు కారణమని వివరించారు.

తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వస్తున్నాయి. నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చాయి. తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని లేదా.. మన రాష్ట్రంలో కలపాలని ఆయా జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సైతం మన సంక్షేమ పథకాలను కొనియాడుతున్నారు. దళితబంధు ప్రకటించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయి. ఏపీలో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని విజ్ఞాపనలు వస్తున్నాయి. తెలంగాణ పథకాలు మాకు కావాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారు. -కేసీఆర్‌, తెరాస అధ్యక్షుడు

ఇదీ చదవండి: కీసరలో డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.