తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని... వ్యవసాయేతర భూమిగా మార్చుకునే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం... భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం పలు సూచనలు చేశారు.
ఏనుగల్ గ్రామం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ స్వస్థలం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాట్లాడడం పట్ల పంచాయతీ కార్యదర్శి రమాదేవి ఆనందం వ్యక్తంచేశారు.