ETV Bharat / city

Cm Kcr Mumbai Tour: ముంబయికి కేసీఆర్.. ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ - Telangana news

Cm Kcr Mumbai Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆదివారం ముంబయికి వెళ్లనున్నారు. దేశ రాజకీయాల్లో మార్పే లక్ష్యంగా పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్... ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన భేటీకానున్నారు.

Cm Kcr Mumbai Tour
Cm Kcr Mumbai Tour
author img

By

Published : Feb 19, 2022, 9:49 PM IST

Updated : Feb 20, 2022, 1:08 AM IST

Cm Kcr Mumbai Tour: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా సర్కార్ రాజకీయాలు, విధానాలపై పోరాటం... దేశ రాజకీయాల్లో మార్పే ఎజెండాలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆదివారం ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ దేశ ఆర్థిక రాజధానికి పయనం కానున్నారు. ఇటీవల కేసీఆర్​కు ఫోన్ చేసిన మహారాష్ట్ర సీఎం... భాజపా అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ఠాక్రే నివాసంలో భేటీ...

దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారన్న ఉద్ధవ్ ఠాక్రే... దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని.. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ముంబయికి వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించాలని... భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ఉద్ధవ్ ఠాక్రే కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు కేసీఆర్ రేపు ముంబయి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం ముంబయి చేరుకుంటారు. బాంద్రా కార్లాలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లి అక్కడ ఆయనతో సమావేశమవుతారు.

కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై...

జాతీయ రాజకీయాలు, దేశవ్యాప్తంగా పరిస్థితులు, కేంద్ర- రాష్ట్రాల మధ్య సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పాలనాపరమైన అంశాలపై కూడా కేసీఆర్, ఠాక్రే చర్చించే అవకాశం ఉంది. ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్​ను కూడా సీఎం కేసీఆర్ కలవనున్నారు. ముఖ్యమంత్రి వెంట కొంత మంది తెరాస నేతలు కూడా ముంబయి వెళ్లనున్నారు.

ఇదీ చూడండి: ఫిల్మ్​ ఇండస్ట్రీ భేటీ.. చిరు, మోహన్​బాబు, విష్ణు కలిసి..

Last Updated : Feb 20, 2022, 1:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.