ETV Bharat / city

CM KCR meeting today: మంత్రులతో సమావేశమైన సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR meeting today).. మంత్రులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. నేడో, రేపో అభ్యర్థులనూ ప్రకటించే అవకాశం ఉంది.

CM KCR meeting today
CM KCR meeting today
author img

By

Published : Nov 20, 2021, 5:43 PM IST

మంత్రులతో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(telangana CM news today) సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్​కు మంత్రులు, తెరాస నేతలు చేరుకున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం(CM KCR meeting today)లో చర్చిస్తున్నారు. ఇకపోతే నేడో, రేపో తెరాస అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (Local Bodies Quota MLC Elections) నోటిఫికేషన్ విడుదలైంది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించగా... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు ఉండగా... ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానం ఉంది. మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.