తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గ తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫారం అందజేశారు. పార్టీ కోసం, ప్రజల కోసం పాటు పడాలని కేసీఆర్ సూచించారు. జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అలాగే అత్యధిక మెజార్టీతో గెలవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
తన భర్త రామలింగారెడ్డికి ఇచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు అదే విధంగా కొనసాగించాలని.. సుజాత కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. భారీ ఆధిక్యంతో గెలిచి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: