ETV Bharat / city

CM Jagan: మహిళలకు 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే: సీఎం జగన్​ - మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం

CM Jagan Wishes to Womens: మహిళలకు ఏకంగా 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని సీఎం జగన్ అన్నారు. దేశంలోనే ఇంతమంది మహిళా ప్రజాప్రతినిధులు మరెక్కడా లేరని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం జగన్​ శుభాకాంక్షలు తెలిపారు.

CM Jagan Wishes to Womens
మహిళా దినోత్సవ సంబరాల్లో సీఎం జగన్​
author img

By

Published : Mar 8, 2022, 2:12 PM IST

Updated : Mar 8, 2022, 3:44 PM IST

CM Jagan Wishes to Womens: మహిళలకు ఏకంగా 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నేనని సీఎం జగన్ అన్నారు. దేశంలోనే ఇంతమంది మహిళా ప్రజాప్రతినిధులు మరెక్కడ లేరని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఇక్కడున్న అతివలు.. మహిళా సాధికారతకు నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. రెండున్నరేళ్లుగా అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసమే వినియోగించామని వెల్లడించిన జగన్‌...రాజకీయ సాధికారత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

"రాష్ట్రంలోని ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సభలో నా చుట్టూ ఉన్న మహిళలంతా ప్రజాప్రతినిధులే. దేశంలోనే ఇంతమంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న రాష్ట్రం,... మహిళలకు ఏకంగా 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం మనది. రాష్ట్ర మహిళలే ఇక్కడి మహిళా సాధికారతకు నిదర్శనం. రెండున్నరేళ్లుగా అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసం వినియోగించాం. రాజకీయ సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది."- సీఎం జగన్​

మహిళా సాధికారత సీఎం జగన్‌ వల్లే సాధ్యమైంది: మహిళా మంత్రులు

రాష్ట్రంలో మహిళా సాధికారత సీఎం జగన్‌ వల్లే సాధ్యమైందని మహిళా మంత్రులు అన్నారు. దేశంలో ఏ మహిళకు దక్కని గౌరవం రాష్ట్ర మహిళలకు దక్కిందని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వ్యాఖ్యానించారు. అతివల అభ్యున్నతికి సీఎం జగన్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి తానేటి వనిత తెలిపారు. సీఎం జగన్‌ లాంటి మహిళా పక్షపాతి.. దేశంలోనే లేరని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

మహిళా దినోత్సవ సంబరాల్లో సీఎం జగన్​

ఇదీ చదవండి:

Womens day wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం..రాజకీయ నాయకుల శుభాకాంక్షలు

Last Updated : Mar 8, 2022, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.