పశ్చిమగోదావరి జిల్లాలో 'అమూల్ పాల వెల్లువ' కార్యక్రమాన్ని సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. దీంతో మరో జిల్లాకు ఏపీ అమూల్ ప్రాజెక్టు విస్తరించినట్లయింది. పశ్చిమగోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ ఇవాళ నుంచే ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. వ్యవసాయ ఆధారిత రంగాల్లోనూ రైతుకు అవకాశం రావాలని ఈ సందర్బంగా జగన్ అన్నారు. దేశంలోనే అమూల్ది ప్రథమ స్థానమన్న సీఎం.. 50 వేల కోట్ల టర్నోవర్ చేస్తోందని స్పష్టం చేశారు. మిగిలిన వారి కంటే ఎక్కువ ధరకు ఇచ్చి అమూల్ పాలు సేకరిస్తోందని వివరించారు. సహకార సంస్థ బాగా నడిపితే ఎలా ఉంటుందనే దానికి అమూల్ నిదర్శనమని కొనియాడారు.
2020 డిసెంబర్‌లో అమూల్ పాల వెల్లువ ప్రారంభించామన్న జగన్..పశ్చిమగోదావరి జిల్లాలో 153 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం మారబోతోందన్నారు.
ఇదీ చదవండి:
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దుచేయాలన్న పిటిషన్ కొట్టివేత