విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మనబడి, నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్న సీఎం.. నవంబర్ 2న పాఠశాలలు ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారినప్పుడే పిల్లల పరిస్థితి మారుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విద్యా వ్యవస్థను సములంగా మార్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రతి పేదవాడికి ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశామన్నారు. పేద పిల్లలు గర్వంగా తలెత్తుకుని పాఠశాలలకు వెళ్లాలని అన్నారు. చదువుతోనే పేదరికం నుంచి కుటుంబాలు బయటపడతాయన్న జగన్.. పేదల తలరాత మార్చేందుకు విద్యాశాఖలో 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి: 'జగనన్న విద్యా కానుక' పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్