కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలి సీఎం జగన్ సూచించారు. కరోనా నివారణపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించారు. కరోనా గురించి అవగాహన పెంచాలని... అపోహలు తొలగించాలని ఆదేశించారు. కలెక్టర్ కన్వీనర్‌గా జిల్లాస్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. సామాజిక దూరం అమలుపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని సీఎం అన్నారు.
ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని ఆదేశించారు. బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా? వాటిని శానటైజ్ చేస్తున్నారా? లేదా? అన్నది చూడాలన్నారు. నిత్యావసరాల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని... కరోనా సాకుతో నిత్యావసరాల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రుల్లో పారాసిటమాల్, యాంటీబయోటిక్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇదీ చదవండి: కరోనా లక్షణాలతో గుంటూరు ఐడీ ఆస్పత్రిలో చేరిన వృద్ధుడు