పోలవరానికి (POLVARAM) కేంద్రం ఇవ్వాల్సిన నిధులు వెంటనే వచ్చేలా చూడాలని సీఎం జగన్ (cm jagan) అధికారులకు సూచించారు. రాష్ట్రం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రియంబర్స్ అయ్యేలా చూడాలన్నారు. మూడు కాంక్రీట్ డ్యామ్ పనులు, ఎగువ కాఫర్ డ్యాం పనులను పూర్తి చేసి.. వచ్చే ఖరీప్ నాటికి కాల్వల ద్వారా నీరందిస్తామని అధికారులు సీఎంకు (cm jagan) నివేదించారు. జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
నెల్లూరు బ్యారేజ్ పనులు పూర్తయ్యాయని.. నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని అధికారులు.. సీఎం జగన్‌కు వెల్లడించారు. వచ్చే ఆగస్టు నాటికి అవుకు టన్నెల్ పూర్తిచేసి నీరందిస్తామన్నారు. అవుకు టన్నెల్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వంశధార స్టేజ్-2 రెండోదశ పనులు వచ్చే మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలని సీఎం జగన్ అన్నారు. ఒడిశాతో చర్చల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
తోటపల్లి కింద వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో నీరివ్వాలని సీఎం అన్నారు. మహేంద్రతనయ పనులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు. తుపాను, వర్షాల వల్ల దెబ్బతిన్న సాగునీటి కాల్వలను బాగు చేయాలని సీఎం సూచించారు. కొల్లేరు డెల్టాల్లో రెగ్యులేటర్ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలన్నారు. తాండవ విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజ్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.
ఇదీ చదవండి: