ఫిబ్రవరి నాటికి పాఠశాలల్లో నాడు-నేడు తొలి దశ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రెండో దశలో వసతి గృహాల్లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. సోమవారం నాడు-నేడు (మనబడి)పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
నాడు-నేడు మనబడిలో మొత్తం 10 రకాల పనులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు-నేడు పనుల పరిశీలనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. జగనన్న గోరుముద్ద తరహాలో వసతి గృహాల్లోనూ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి