ETV Bharat / city

క్యాన్సర్‌ నివారణ, నియంత్రణ, చికిత్సలపై.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: సీఎం - ముఖ్యమంత్రి జగన్

CM REVIEW ON HEALTH DEPARTMENT : క్యాన్సర్‌ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌లో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యతపై.. ప్రతినెలా నివేదికలు పంపాలని ఆదేశించారు. అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరుపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు.

CM REVIEW ON HEALTH DEPARTMENT
CM REVIEW ON HEALTH DEPARTMENT
author img

By

Published : Sep 13, 2022, 8:43 PM IST

Updated : Sep 14, 2022, 6:24 AM IST

CM REVIEW : క్యాన్సర్‌ చికిత్స, నియంత్రణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ పనితీరుపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాసుపత్రులతోపాటు కొత్తగా రానున్న అయిదు వైద్య కళాశాలల్లోనూ ప్రత్యేకంగా క్యాన్సర్‌ విభాగాలను ఏర్పాటు చేయాలి. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు జీజీహెచ్‌లలో నాలుగు లైనాక్‌ మిషన్లు ఏర్పాటు చేయాలి. ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం ఆసుపత్రుల్లో బంకర్ల (ప్రత్యేక విభాగాలు)ను నిర్మించాలి. మరో ఏడు బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ నివారణ శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్‌ థియేటర్‌ అభివృద్ధి చేయాలి. ఈమేరకు పాథాలజీ డిపార్టుమెంట్లలో ఆధునిక సౌకర్యాలు, కీమోథెరపీ, మందులు, ఇతర సదుపాయాలను కల్పించాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పర్యవేక్షణ కోసం జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలి’ అని ఆదేశించారు.

రక్తహీనత కేసులు రాకుండా చూడాలి

‘ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఇంటికి వెళ్లిన రోగులకు అదనంగా చికిత్స అవసరమైతే వైద్యాధికారితో ఏఎన్‌ఎం మాట్లాడాలి. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల జాబితాను విలేజ్‌ హెల్త్‌ క్లినిక్కులు, సచివాలయాలలో అందుబాటులో ఉంచాలి. 104 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసిన వెంటనే అనుబంధ ఆసుపత్రి ఎక్కడుందో తెలియచేసేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయానికి ఆర్బీకేలు ఎలా వ్యవహరిస్తున్నాయో అలాగే.. ప్రజారోగ్య విషయంలోనూ విలేజ్‌ క్లినిక్కులు కీలకపాత్ర పోషించాలి. ప్రతి బోధనాసుపత్రి ఆ జిల్లాకు సంబంధించిన వైద్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో రక్తహీనత సమస్యలు తగ్గించేందుకు కృషి జరగాలి. రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని బాధితులకు అంగన్‌వాడీల ద్వారా పౌష్ఠికాహారం అందించాలి. రక్తహీనత కేసులు రాకుండా చూడాలి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగాలి. వారికి నిరంతరం కంటి పరీక్షలు చేయాలి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేందుకు వీలుగా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. ప్రతి వారం కొత్త వైద్య కళాశాలల భవనాల నిర్మాణాలపై సమీక్ష జరగాలి’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

వర్చువల్‌ ఖాతాల ద్వారా చెల్లింపులు: అధికారులు

‘ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన వర్చువల్‌ ఖాతాల ద్వారా ఆసుపత్రుల యాజమాన్యాలకు చెల్లింపులు చేస్తున్నాం. డబ్బు చెల్లింపు జరిగిన వెంటనే లబ్ధిదారుల చరవాణికి సంక్షిప్త సందేశం వెళ్తోంది. రోగులు ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యేటప్పుడు వారికి అందించిన సేవలపై సమ్మతి లేఖలను తీసుకుంటున్నాం. ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల పనితీరుపైనా రోగుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాం. ఇంటికి వచ్చిన అనంతరం ఏఎన్‌ఎం రోగిని కలిసి సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేస్తారు’ అని సీఎంకు అధికారులు వివరించారు.

క్యాన్సర్‌ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జిల్లాలో వైద్య కార్యకలాపాల కేంద్రంగా బోధనాస్పత్రులు ఉండాలి. విలేజ్‌ క్లినిక్స్‌ సహా ప్రతి ఆస్పత్రి.. బోధనాస్పత్రి పరిధిలోకి రావాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమానికి జిల్లాల్లో అధికారిని నియమించాలి. రక్తహీనత నివారణపై దృష్టి సారించాలి. అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరును పర్యవేక్షించాలి. -జగన్​, ముఖ్యమంత్రి

వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో.. 12 రకాల రాపిడ్‌ డయాగ్నోస్టిక్స్‌ కిట్లు, 67 రకాల మందులు.. అందుబాటులో ఉంచాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌లో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యతపై.. ప్రతినెలా నివేదికలు పంపాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. రక్తహీనత నివారణపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరుపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 14, 2022, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.