కర్నూలు జిల్లా పత్తికొండలో టమాట కొనుగోళ్ల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆరా తీశారు. డీ రెగ్యులేట్ చేయడంతో టమాట కొనుగోళ్లు నిలిపేశారని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు తెలిపారు. మార్కెట్లో కాకుండా బయట అమ్మితేనే కొంటామని ఏజెంట్లు ఇబ్బందిపెట్టారని అన్నారు. మార్కెట్లోనే టమాట అమ్ముతామని రైతులు స్పష్టం చేసినట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పత్తికొండ మార్కెట్‌యార్డులో తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి 50 టన్నుల టమాట కొనుగోలు చేశామన్న అధికారులు... ధరలు తగ్గకుండా వేలంపాటలో మార్కెటింగ్‌శాఖ అధికారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఐదు టన్నుల వరకు కొనుగోలు చేసిన మార్కెటింగ్ శాఖ... ధరల స్థిరీకరణ నిధి కింద ఈ కొనుగోళ్లు చేశామని చెప్పారు. వ్యాపారులు టమాట కొనుగోలు చేస్తున్నారని మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న వెల్లడించారు.
టమాట కొనుగోళ్ల సమస్యలపై.. సీఎం జగన్ ఆరా
పత్తికొండలో టమాట కొనుగోళ్ల సమస్యలపై సీఎం జగన్ ఆరా తీశారు. పండ్లు, కూరగాయలను డీ రెగ్యులేట్ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మార్కెట్ ఫీజు, ఏజెంట్లకు కమీషన్ లేకుండా రైతులు అమ్ముకోవచ్చని అధికారులు వెల్లడించారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో టమాట కొనుగోళ్ల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆరా తీశారు. డీ రెగ్యులేట్ చేయడంతో టమాట కొనుగోళ్లు నిలిపేశారని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు తెలిపారు. మార్కెట్లో కాకుండా బయట అమ్మితేనే కొంటామని ఏజెంట్లు ఇబ్బందిపెట్టారని అన్నారు. మార్కెట్లోనే టమాట అమ్ముతామని రైతులు స్పష్టం చేసినట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పత్తికొండ మార్కెట్‌యార్డులో తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి 50 టన్నుల టమాట కొనుగోలు చేశామన్న అధికారులు... ధరలు తగ్గకుండా వేలంపాటలో మార్కెటింగ్‌శాఖ అధికారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఐదు టన్నుల వరకు కొనుగోలు చేసిన మార్కెటింగ్ శాఖ... ధరల స్థిరీకరణ నిధి కింద ఈ కొనుగోళ్లు చేశామని చెప్పారు. వ్యాపారులు టమాట కొనుగోలు చేస్తున్నారని మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న వెల్లడించారు.
jagan
Conclusion: