ETV Bharat / city

సత్వర ఫలితాలిచ్చే.. కొత్త ప్రాజెక్టులు చేపట్టండి: సీఎం జగన్ - jagan review meeting

నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి, ఈ మేరకు కార్యాచరణ అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సత్వర ఫలాలిచ్చే వాటిపై దృష్టి పెట్టాలన్న ఆయన.. అవసరమైన కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. కృష్ణా వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు 40 రోజుల్లో నిండాలని, కాల్వల సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.

సత్వర ఫలితాలిచ్చే.. కొత్త ప్రాజెక్టులు చేపట్టండి : సీఎం జగన్
author img

By

Published : Oct 28, 2019, 10:15 PM IST

Updated : Oct 28, 2019, 11:16 PM IST

సత్వర ఫలితాలిచ్చే.. కొత్త ప్రాజెక్టులు చేపట్టండి: సీఎం జగన్
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పెండింగ్‌, అత్యవసరంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జలవనరుల శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలు నిర్దేశించుకుని, ఆ మేరకు సమీకరించుకున్న ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించాలని సీఎం తెలిపారు.

రిజర్వాయర్లు నింపడానికి కార్యచరణ
పోలవరం, వెలిగొండ, వంశధార సహా, కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా సీఎం చర్చించారు. అధిక వరద వచ్చినా కొన్ని రిజర్వాయర్లు నిండకపోవడంపై సీఎం అధికారులను లోతుగా ప్రశ్నించారు. కృష్ణా వరద జలాలపై ఆధారపడ్డ రిజర్వాయర్లను 40 రోజుల్లో నింపడానికి చర్యలను తీసుకోవాలన్నారు. వీటి కోసం చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.

ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై ఆరా
రాష్ట్రంలోని ప్రాజెక్టుల వారీగా పరిస్థితిని సీఎం జగన్ సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ పరిస్థితిపై చర్చించారు. ఇదే సమయంలో నేరడి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీపై విస్తృతంగా చర్చించారు. ట్రిబ్యునల్‌ ఆదేశాలు, కోర్టు తీర్పుల తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముసురుమల్లి ప్రాజెక్టుకు మార్చి నాటికి గేట్లు అమర్చే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడుకు వెళ్లే కాల్వ సామర్థ్యాన్ని పెంచి...నీటిని తరలించే ఆలోచన చేయాలని అధికారులకు చెప్పారు. కంభం ట్యాంకుకు కూడా వెలిగొండ నుంచి నీటిని తరలించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. గుండ్లకమ్మ కాల్వ పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమశిల నుంచి కండలేరుకు సమాంతరంగా మరో కాల్వ తవ్వకంపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కనిగిరి రిజర్వాయర్‌ అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు ఇవ్వాలన్న స్థానిక ప్రజాప్రతినినిధుల విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు.

ఆ రిజర్వాయర్లు ఎందుకు నిండలేదు?
ఈ సీజన్‌లో అధిక వరద వచ్చినా రాయలసీమలోని కొన్ని రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. చిత్రావతి, బ్రహ్మంసాగర్‌ పూర్తిగా నిండకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు వరద జలాలను తరలిస్తున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పత్తికొండ రిజర్వాయర్‌కు సంబంధించి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. తిరుపతి సమీపంలోని కల్యాణి డ్యాం, ఎన్టీఆర్‌ జలాశయం ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నింపడంపైనా చర్చించారు. వెలిగొండ, గండికోట, సీబీఆర్‌ ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. తుంగభద్ర కాలువ ఆధునికీకరణ పనులు పూర్తయ్యేలా దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఇదీ చదవండి :

నిధులను జాగ్రత్తగా వినియోగించాలి: జగన్​

sample description
Last Updated : Oct 28, 2019, 11:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.