ETV Bharat / city

వారందరినీ బీమా పరిధిలో చేర్చండి: సీఎం జగన్ - సీఎం జగన్ లెటెస్ట్ వార్తలు

కరోనా నివారణ కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణీత సిబ్బందికి కరోనా బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ అదేశించారు.

cm jagan review on covid 19
వారందరినీ బీమా పరిధిలో చేర్చండి : సీఎం జగన్
author img

By

Published : Apr 19, 2020, 3:33 PM IST

కొవిడ్-19 నివారణపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వైనం, పెరుగుతున్న కేసులు, వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.

ఆసుపత్రుల్లో క్లీనింగ్ డ్రైవ్​లు

కరోనా బీమా పరిధిలోకి వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను చేర్చాలని సీఎం ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు, ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారిని బీమా పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలన్న సీఎం... ప్రతి 2-3 రోజులకోసారి స్పెషల్‌ డ్రైవ్ చేపట్టాలన్నారు. ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా వ్యవస్థను తయారుచేయాలని సీఎం సూచించారు.

పరీక్షల నిర్వహణలో ఏపీ రెండో స్థానం

కరోనా పరీక్షల నిర్వహణపై సీఎం ఆరాతీశారు. నిన్న ఒక్కరోజే 5400 కరోనా టెస్టులు చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానానికి చేరుకుందని అధికారులు తెలిపారు. జనాభా ప్రాతిపదికన ప్రతీ 10 లక్షల మందికి పరీక్షలు చేస్తున్న జాబితాలో ఏపీ రెండో స్థానానికి చేరుకున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో 685 పరీక్షలు చేస్తుండగా, 539 పరీక్షలతో రెండో స్థానంలో రాష్ట్రం ఉన్నట్లు తెలిపారు. ర్యాపిడ్‌ కిట్స్‌ వినియోగించకుండానే ఈ స్థాయికి చేరినట్లు అధికారులు వివరించారు. మరో 3,4 రోజుల్లో టెస్టులు సంఖ్య బాగా పెరుగుతుందని సీఎంకు తెలిపారు. రోజుకు 17,500కు పైగా నిర్ధరణ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన 32 వేల మందికి పరీక్షలు చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి జగన్​కు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఒక్కొక్కరికీ 3 మాస్కులు అందించండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.