వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల లబ్ధిదారులైన అందరూ స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం ఎంవోయూలు చేసుకున్న సంస్థలతో పాడి పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పశుసంవర్థకం, మత్స్యశాఖలపై సమీక్షించిన ఆయన... వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
దాదాపు 4వేల కోట్లతో ప్రతి మండలంలో శీతలగిడ్డంగులు, గోదాములు, ప్రీ ప్రాసెసింగ్ తదితర యూనిట్లు నెలకొల్పనున్నట్లు సీఎం వెల్లడించారు. వీటిని జనతాబజార్లకు అనుసంధానం చేయాలన్నారు. పాడి పశువుల కొనుగోలులో అమూల్ సంస్థ సలహాలు తీసుకోవాలని.... తర్వాత దాణా, సంరక్షణలోనూ వారి భాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు. దీని వల్ల ఉత్తమ బ్రీడ్లు, పెంపకంలో మంచి విధానాలు, మంచి మార్కెటింగ్ లభిస్తుందన్నారు. పశువుల కొనుగోలులో ఎక్కడా రాజీ పడొద్దన్న సీఎం..... మేలైన జాతులను ఎంపిక చేసుకుంటూ అవినీతికి తావు ఇవ్వకూడదన్నారు.
ఇదీ చదవండి : చికెన్ షాపుకెళ్లి చెయ్యి తెగనరుక్కుని...