ETV Bharat / city

జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం జగన్ సమీక్ష..ఈ ఏడాది ఎన్ని పోస్టులు భర్తీ చేశారంటే...! - సీఎం జగన్ సమీక్ష

జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 8 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

cm jagan
cm jagan
author img

By

Published : Jun 17, 2022, 6:06 PM IST

Updated : Jun 17, 2022, 8:32 PM IST

జాబ్‌ క్యాలెండర్‌పై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాదిలో జరిగిన నియామకాలు, భర్తీ చేయాల్సిన పోస్టులపై సమీక్షించారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌పై సమగ్రంగా సీఎం చర్చించారు. 2021-22 ఏడాదిలో 39,654 పోస్టులు భర్తీ చేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ చేసినట్టు తెలిపారు. గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను ఈ ఒక్క ఏడాదిలో పూర్తి చేసినట్టు తెలిపారు. ఇంకా సుమారు 8వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. జాబ్‌ క్యాలెండర్‌లో మిగిలిన 8వేలకుపైగా పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టి పెట్టాలని, పోలీసు రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ రూపొందించి దాని ప్రకారం క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.

వైద్యారోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా భర్తీ చేయాలన్నారు. ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలని సీఎం నిర్దేశించారు. నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్య, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆసుపత్రులు, విద్యాలయాలు కడుతున్నామన్న సీఎం.. అక్కడ ఖాళీలు భర్తీ చేయకపోవడం సరికాదని, భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవన్నారు. ఉన్నత విద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రెగ్యులర్‌ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియామకాలు జరగాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా దీన్ని రూపొందించుకోవాలన్నారు. వచ్చే నెల మొదటివారంలో తనకు నివేదించాలని, కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. ఆర్టీసీని కలపడం ద్వారా మరో 50 వేల మందిని తీసుకున్నాం. అలాగే జాబ్‌ క్యాలెండర్‌లో భర్తీ కాని పోస్టుల నియామకంపై కార్యాచరణ చేపట్టాం.పోలీసుశాఖలో ఖాళీలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. పోలీసు, ఆర్థికశాఖలు చర్చించి త్వరగా ప్రణాళిక తయారుచేసి... వచ్చే నెల తొలి వారంలో నాకు కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి. -జగన్‌, ఏపీ సీఎం

ఇదీ చదవండి:

Last Updated : Jun 17, 2022, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.