అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో... చక్కెర పరిశ్రమల పునరుద్ధరణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు బొత్స, కన్నబాబు, మేకపాటి గౌతంరెడ్డిలు పాల్గొన్నారు. సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలు తెలుసుకున్న సీఎం... ప్రభుత్వ పరంగా ఎంతవరకూ వినియోగించగలమో ఆలోచించాలన్నారు. తితిదేతో పాటు ప్రధాన ఆలయాలు, హాస్టళ్లు, అంగన్‌వాడీల్లో వినియోగించాలని ఆదేశించారు.
ఎక్కడ వీలైతే అక్కడ చక్కెర నిల్వలు వినియోగించుకోవాలని... రైతులకు బకాయిలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చాలన్నారు. ఈ నెల 8న రైతు దినోత్సవం సందర్భంగా.. రూ.54.6 కోట్లు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 15 వేలమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
చక్కెర పరిశ్రమలపై ఆలోచన చేసి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. తగిన అధ్యయనం చేయాలని మంత్రుల బృందం, అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి సమగ్రమైన నివేదిక ఇవ్వాలన్నారు.
ఇవీ చదవండి:
'అమరావతి రైతులు ఆందోళన చెందొద్దు.. కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుంది'