ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 63 పులుల చిత్రాలతో కూడిన పుస్తకం, పోస్టర్లు సీఎం జగన్ ఆవిష్కరించారు. పులుల సంరక్షణ చర్యలపై సీఎంకు.. అటవీ అధికారులు వివరించారు. ప్రభుత్వ చర్యలతో పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు.
గతేడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. నల్లమల నుంచి శేషాచలం వరకు పులుల ప్రయాణం ఉందని.. కడప, చిత్తూరు ప్రాంతాల్లోనూ పులుల ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పులుల సంరక్షణ చర్యలను పటిష్టంగా కొనసాగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. టైగర్ రిజర్వ్‌లో సిబ్బంది వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకరించారు.
ఇదీ చదవండి: