ETV Bharat / city

నాటు సారా, గంజాయి కనిపించొద్దు.. అధికారులను ఆదేశించిన సీఎం జగన్​ - పెరిగిన ఆదాయం

CM Jagan Review: రాష్ట్రంలో నాటు సారా తయారీ, విక్రయాలు సహా గంజాయి సాగు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. వీటి తయారీ సాగుపై ఆధారపడిన కుటుంబాల ఆర్ధిక పరిస్ధితులు మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి సాగును వదలి ఇతర పంటలు సాగు చేస్తున్న వారికి ఆర్వో ఎఫ్​ఆర్​ పట్టాలు ఇవ్వడం సహా రైతు భరోసా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గినా, ఆదాయం పెరిగినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఎర్రచందనం అమ్మకానికి అన్ని అనుమతులు వచ్చాయని తెలిపిన అధికారులు.. త్వరలో 2 వేల 640 మెట్రిక్‌ టన్నుల విక్రయానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

jagan
jagan
author img

By

Published : Sep 1, 2022, 10:40 PM IST

Updated : Sep 2, 2022, 6:22 AM IST

CM Jagan Review: రాష్ట్రంలో మద్యం ధరలు షాక్‌ కొట్టేలా పెట్టడంతోపాటు, బెల్ట్‌షాపులు ఎత్తివేయడంతో వినియోగం బాగా తగ్గిందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. నాటు సారా తయారు చేస్తున్నవారిని దాని నుంచి బయట పడేయాలని అధికారులకు సూచించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు, స్వయం ఉపాధిని కల్పించి వారికి గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా చూడాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలపై ముఖ్యమంత్రి గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు. ఆదాయార్జనకు సంబంధించి వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, పురోగతిపై సీఎం సమీక్షించారు.

రాష్ట్రంలో 2018-19లో 384.31 లక్షల కేసుల మద్యం విక్రయించగా, 2021-22లో ఆ సంఖ్య 278.5 లక్షలకు తగ్గిందని అధికారులు వివరించారు. 2018-19లో 277.10 లక్షల కేసుల బీరు విక్రయాలు జరగ్గా, 2021-22లో 82.6 లక్షలకు తగ్గిందన్నారు. 2018-19లో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.20,128 కోట్ల ఆదాయం రాగా, 2021-22లో రూ.25,023 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. గడచిన ఆరు నెలల్లో అక్రమ మద్యం తయారీ, గంజాయికి సంబంధించి 20,127 కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. 16,027 మందిని అరెస్ట్‌ చేశామని, 1,407 వాహనాలను సీజ్‌ చేశామని వెల్లడించారు. నాటుసారా తయారీనే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

గంజాయి సాగును వదిలితే... పట్టాలు, రైతు భరోసా
గంజాయి సాగుని వదిలేసి ఇతర పంటలు సాగు చేస్తున్నవారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చి, రైతు భరోసా వర్తింపు చేయాలని సీఎం ఆదేశించారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. గంజాయి సాగుపై క్రమం తప్పక దాడులు నిర్వహించాలని ఆదేశించారు.

పాస్‌పోర్టు ఆఫీసుల్లా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు
గ్రామ సచివాలయం నుంచి, కలెక్టరేట్‌ల వరకు, పోలీసు స్టేషన్‌ల నుంచి ఎస్పీ కార్యాలయం వరకు అన్నిచోట్లా అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) సంబంధించిన 14400 నంబరు కనిపించాలని సీఎం ఆదేశించారు. రేషన్‌ దుకాణాల వద్ద కూడా ఈ బోర్డులు ఉండాలన్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులకు కొత్త రూపు ఇవ్వాలని, పాస్‌పోర్టు కార్యాలయాల తరహాలో వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. మైనింగ్‌కు సంబంధించి అన్ని అనుమతులు, లైసెన్స్‌లు పొందినవారు వాటిని నిర్వహిస్తున్నారో లేదో పరిశీలించాలని సీఎం ఆదేశించారు. సమస్యలుంటే సానుకూలంగా పరిష్కరించాలన్నారు.

పారదర్శకంగా ఎర్రచందనం విక్రయాలు
ఎర్రచందనం విక్రయానికి అన్ని రకాల అనుమతులూ వచ్చాయని, వచ్చే అక్టోబరు-మార్చి నెలల మధ్య 2,640 మెట్రిక్‌ టన్నులు విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఎర్రచందనం విక్రయాల్లో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని, గ్రేడింగ్‌లో తృతీయపక్షంతో కూడా పరిశీలన చేయించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌) కె.నారాయణస్వామి, రెవెన్యూ, విద్యుత్‌, రవాణా శాఖల మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రితో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ భేటీ
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నూతన కన్వీనర్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జీఎం నవనీత్‌కుమార్‌ గురువారం ముఖ్యమంత్రి జగన్‌ను తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఇటీవలే ఎస్‌ఎల్‌బీసీ నూతన కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

నాటు సారా, గంజాయి కనిపించొద్దు.. అధికారులను ఆదేశించిన సీఎం జగన్​

ఇవీ చదవండి:

Last Updated : Sep 2, 2022, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.