ETV Bharat / city

2022 నాటికి అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం : సీఎం - cm jagan on house constructions to poor

పీఎంఏవై(అర్బన్‌), ఆశా ఇండియా అవార్డుల కార్యక్రమంలో భాగంగా ప్రధాని నిర్వహించిన వర్చువల్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్​ పాల్గొన్నారు. ఆయనతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొన్నారు. పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఏపీకి మూడో ర్యాంకు లభించింది. దీనిపై సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు.

cm jagan on pmay awards program
cm jagan on pmay awards program
author img

By

Published : Jan 1, 2021, 12:54 PM IST

Updated : Jan 1, 2021, 4:24 PM IST

పీఎంఏవై(అర్బన్‌), ఆశా ఇండియా అవార్డుల కార్యక్రమం వర్చువల్​గా జరిగింది. అవార్డులు కైవశం చేసుకున్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

పీఎంఏవై అర్బన్‌ ఇళ్లనిర్మాణ కార్యక్రమంలో ఏపీకి మూడో ర్యాంకు, అవార్డు రావడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. కరోనా ప్రభావంతో దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థ కొత్త ఏడాదిలో కొలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రధానికి, పలు రాష్ట్రాల సీఎంలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

పీఎంఏవై పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. అందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులకు ఇళ్లు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. 2022 కల్లా అర్హులందరికీ ఇళ్ల నిర్మించి ఇస్తామని చెప్పారు. భారీగా నిర్మిస్తున్న ఇళ్లకు భూసేకరణ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిందని ప్రధానికి వివరించారు. ఈ నివాసాల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైతే.. లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో ఏపీకి రెండు అవార్డులు లభించాయి. ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ విభాగంలో జీవీఎంసీకి తొలి ర్యాంకు వచ్చింది.

పీఎంఏవై(అర్బన్‌), ఆశా ఇండియా అవార్డుల కార్యక్రమం

ఇదీ చదవండి: లైట్​ హౌస్​ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

Last Updated : Jan 1, 2021, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.