ETV Bharat / city

రాష్ట్రానికి రండి.. ప్రధానికి సీఎం జగన్ ఆహ్వానం - నిధులు కేటాయించాలని ప్రధానికి జగన్ వినతి

ప్రధాని మోదీతో సీఎం జగన్ దిల్లీలో సమావేశమయ్యారు. కర్నూలుకు హైకోర్టు తరలింపుతో పాటు, మండలి రద్దుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించిన సీఎం జగన్.. 10 అంశాలతో ఉన్న ఓ వినతి పత్రాన్ని అందించారు.

cm jagan met pm modi and requests funds for Ap
ప్రధాని మోదీతో సీఎం జగన్
author img

By

Published : Feb 12, 2020, 10:32 PM IST

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

రాష్ట్ర సమస్యలను ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. దిల్లీలో ప్రధానితో సమావేశమైన సీఎం.. గంటన్నరకు పైగా కీలక విషయాలపై చర్చించారు. 10 అంశాలతో కూడిన ఓ విజ్ఞాపన పత్రాన్ని ప్రధానికి అందించారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ప్రధానిని సీఎం ఆహ్వానించారు.

ప్రధాని మోదీకి సీఎం అందించిన వినతిపత్రంలోని అంశాలు

  1. ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందించే కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
  2. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానికి సీఎం చెప్పారు. ఇందుకే.. పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ ప్రణాళికలు రూపొందించామని వివరించారు. పాలనా సౌలభ్యం కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేశామన్నారు.
  3. శాసనమండలి రద్దు అంశాన్ని ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో సీఎం జగన్ ప్రస్తావించారు. ప్రజాప్రభుత్వం చేసిన బిల్లులను మండలి అడ్డుకుంటోందన్నారు. మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేశామని ప్రధానికి చెప్పారు. తదుపరి చర్యలకు కేంద్ర న్యాయ శాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
  4. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలన్నారు.
  5. అభివృద్ధి అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానికి.. సీఎం జగన్ విజ్ఞప్తిచేశారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రమే తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసిన అంశాన్ని ప్రధానికి నివేదించారు.
  6. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్న జగన్.. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి పునరావాసం కల్పన అనుకున్న సమయానికి పూర్తిచేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3320 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని సంబంధిత శాఖకు ఆదేశాలివ్వాలని కోరారు.
  7. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటు భర్తీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కాగ్‌ అంచనా వేసిన రూ.22,948.76 కోట్ల రెవెన్యూ లోటులో... ఇంకా రూ.18,969.26 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంందన్నారు. వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
  8. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయన్న జగన్.. గత ప్రభుత్వంతో పోల్చిస్తే ఈ మొత్తం తక్కువే అని ప్రధానికి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ విడుదల చేయాలని కోరారు. కడప స్టీల్‌ ప్లాంటు, రామాయపట్నం పోర్టు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే... రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
  9. గడిచిన ఆరేళ్లలో వెనుకబడిన 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, మూడేళ్ల నుంచి కేటాయింపులు లేవని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఆ కేటాయింపుల్లోనూ రూ.2,100 కోట్లకు గాను రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. వెనుకబడిన జిల్లాలైన బుందేల్‌ఖండ్, కలహండికి మంజూరు చేసిన నమూనాలో నిధులివ్వాలని సీఎం కోరారు.
  10. ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం –2019కు ఆమోదం తెలపాల్సిందిగా ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం గురించి ప్రధానికి వివరించారు.

ఇదీ చదవండి:

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.