సీఎం జగన్ రెండురోజుల దిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో దాదాపు 45 నిమిషాల పాటు జగన్ భేటీ అయ్యారు. హైకోర్టు తరలింపు, శాసనమండలి రద్దు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్రమంత్రితో భేటీ తర్వాత దిల్లీ విమానాశ్రయానికి బయల్దేరారు. కాసేపట్లో సీఎం జగన్ దిల్లీ నుంచి గన్నవరం బయల్దేరి రానున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించారు. కేంద్ర సాయంపై చర్చించారు.
ఇదీ చదవండి: హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ చర్చించిన అంశాలివే..!