CM Jagan meet with YSRCP MLAs: ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో సరైన పనితీరు కనపరచలేదని మండిపడ్డారు. 27 మంది ఎమ్మెల్యేల పని తీరు బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. లేకుంటే సీటు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా ఇన్‌ఛార్జిలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల పనితీరు సర్వే నివేదికను సీఎం జగన్ వెల్లడించారు. నవంబరులో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని చెప్పారు. ఎన్నికలకు 6 నెలల ముందే సీటు ఇవ్వనివారి పేర్లు ప్రకటిస్తానని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: