ETV Bharat / city

కడప జిల్లాకు సీఎం... ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్‌ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. మూడ్రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి... దాదాపు 6 వేల కోట్ల రూపాయలతో సాగునీటి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీనికి సంబంధించి పాలనా అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది.

cm jagan for kadapa today
కడప జిల్లాకు సీఎం... ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
author img

By

Published : Dec 23, 2019, 5:59 AM IST

కడప జిల్లాకు సీఎం... ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన

నేటి నుంచి మూడ్రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకొని... అక్కడి నుంచి హెలికాప్టర్​లో 11 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె-పెద్దదండ్లూరుకు చేరుకుంటారు. "ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్" ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు.

ఈ పరిశ్రమ కోసం ఇప్పటికే 3వేల 148 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీన్ని రెవిన్యూ అధికారులు 4 రోజుల కిందటే ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్​కు అప్పగించారు. వారం కిందటే ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఇనుప ఖనిజం తరలించారు. రెండ్రోజుల కిందటే గండికోట జలాశయం నుంచి పరిశ్రమకు అవసరమైన నీటిని కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

విభజన తర్వాత కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచినా... కేంద్రం పట్టించుకోలేదు. జిల్లా వాసుల కల నెరవేర్చేందుకు 2018 డిసెంబర్‌ 27న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎం.కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇది మరుగున పడింది.

గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బ్రహ్మణీ స్టీల్స్‌కు-2007 జూన్ 10న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. చిటిమిటిచింతల వద్ద శంకుస్థాపన చేశారు. 2009లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత అదీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మూడోసారి జమ్మలమడుగు ప్రాంతంలోనే ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.

శంకుస్థాపన తర్వాత సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్​ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్ పర్యవేక్షించారు. మధ్యాహ్నం కందూ నదిపై నిర్మించే మూడు ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. మైదుకూరు-బద్వేలు నియోజకవర్గాల్లోని జొలదరాశి జలాశయం, రాజోలి రిజర్వాయర్, కుందూ-తెలుగుగంగ కాల్వ ఎత్తిపోతల పథకాలకు నేలటూరు వద్ద శంకుస్థాపన చేస్తారు.

అనంతరం కడపకు చేరుకొని రిమ్స్‌లో 107 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే క్యాన్సర్ కేర్ సెంటర్​కు శంకుస్థాపన చేస్తారు. 175 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ భవనానికి శ్రీకారం చుడతారు. రాయచోటిలో 340 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ, వాటర్ పైపులైను, పట్టణ సుందరీకరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే 83 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.

మంగళవారం ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటిస్తారు. వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడే చర్చిలో ప్రార్థనలు చేస్తారు. తర్వాత రాయచోటిలో అభివృద్ధి పనులు, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందులకు చేరుకుంటారు. 25న అక్కడే సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు.

ఇదీ చదవండీ...

వీవీఐటీలో ఘనంగా ముగిసిన యువజనోత్సవాలు

Intro:యాంకర్
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో 23, 24, 25 మూడు రోజుల పాటు పర్యటించనున్నారు ఇందులో భాగంగా జమ్మలమడుగు రాయచోటిలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు
వాయిస్ ఓవర్
కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వాలు శంకుస్థాపన చేసినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు లోని సున్నపురాళ్లపల్లె వద్ద అ ఉక్కు పరిశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేయనున్నారు దీంతో పాటు జిల్లాలో దాదాపు ఆరు వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు కాలువల సామర్థ్యం పెంచనున్నారు 23వ తేదీన కడపలోని రిమ్స్ లో లో క్యాన్సర్ ఆసుపత్రి తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేయనున్నారు అక్కడి నుంచి జమ్మలమడుగు చేరుకొని సున్నపురాళ్లపల్లె లో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు అదే రాత్రి ఇడుపులపాయలో బస చేసి 24 తేదీన ఉదయం అక్కడ జరిగే ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొంటారు మధ్యాహ్నం రాయచోటి చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి అనంతరం జరిగే బహిరంగసభకు హాజరుకానున్నారు తిరిగి రాత్రి పులివెందుల చేరుకొని 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా కుటుంబ సభ్యులు బంధువులతో గడిపి అక్కడినుంచి అమరావతి చేరుకోనున్నారు
బైట్ హరి కిరణ్ జిల్లా కలెక్టర్
వాయిస్ ఓవర్
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్ల పరిశీలనలో నిమగ్నమై ఉంది జమ్మలమడుగు రాయచోటి లో జరిగే భారీ బహిరంగ సభ లకు ఏర్పాట్లను జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సభకు వచ్చే ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన ఈ సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశామని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు
వాయిస్ ఓవర్
రాయచోటిలో 24వ తేదీన సుమారు రెండు వేల కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి నీ 50 పడకల నుంచి వంద పడకల కు మార్చనున్నారు వీరభద్ర స్వామి ఆలయంలో కోటి 50 లక్షలతో ఐదు అంతస్థుల గోపురం నిర్మించనున్నారు రాయచోటి మున్సిపాలిటీకి 240 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ తో పాటు పట్టణ సుందరీకరణ కోసం 6 కోట్లు గ్రామీణ పారిశుద్ధ్యం పనులకు 30 కోట్ల తో మిగిలిన అభివృద్ధి పనులు చేయనున్నారు రాయచోటి కడప పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు జి ఎన్ ఎస్ ఎస్ నుంచి హంద్రీనీవా అనుసంధానం చేస్తూ 1250 కోట్ల తో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు దీని ద్వారా పులివెందుల నియోజకవర్గం లోని చక్రాయపేట రాయచోటి నియోజకవర్గం లోని లక్కిరెడ్డిపల్లె రామాపురం గాలివీడు మండలాలకు లబ్ధి చేకూరనుంది రాయచోటి లో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నారు
బైట్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ రాయచోటి ఎమ్మెల్యే
ఎండ్ వాయిస్ ఓవర్
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ సౌకర్యాలు లోటు లేకుండా అధికారులు ప్రజాప్రతినిధులు ఇన్చార్జి మంత్రి ఎమ్మెల్యేలు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు

Body:బైట్స్
హరి కిరణ్ జిల్లా కలెక్టర్
గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ రాయచోటి ఎమ్మెల్యే

Conclusion:కడప జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పూర్తి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.