ETV Bharat / city

బిల్లులకు మండలిలో ఆమోదం లభించేనా?

శాసన సభలో రేపు ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడు రాజధానులు ఏర్పాటు చేసే అంశంపై ముందుకే వెళ్లాలని అధికారపక్షం నిర్ణయించినట్టు సమాచారం. వీటికి సంబంధించిన బిల్లులను సభలో పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

cm jagan discussed on bills with ministers

author img

By

Published : Jan 19, 2020, 6:56 PM IST

మూడు రాజధానుల ఏర్పాటుపై ముందుకే వెళ్లాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులకు.. వైకాపా సర్కారు తుది రూపునిస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు శాసన సభ సమావేశం ప్రారంభం కానుంది. అంతకు ముందే ఉదయం 9 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ అవుతుంది. శాసన సభలో ప్రవేశ పెట్టనున్న బిల్లులపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించనున్నారు. రేపు ఎన్ని బిల్లులు సభలో ప్రవేశపెడతారు? వాటిలో ఏయే అంశాలు ఉంటాయనే విషయమై ఉత్కంఠ నెలకొంది.

రేపు ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. న్యాయపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండేలా బిల్లును రూపొందిస్తున్నట్లు తెలిసింది. బిల్లులోని అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. శాసనసభ, శాసన మండలిలోనూ బిల్లులను నెగ్గించుకునేందుకు ప్రత్యేక వ్యూహాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. శాసనసభలో వైకాపాకు సంపూర్ణ మెజారిటీ ఉంది. 151 మంది ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం నుంచి దూరంగా ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైకాపాకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. ఫలితంగా.. శాసనసభలో బిల్లులన్నీ ఆమోదం పొందనున్నాయి.

'మండలిలో ఏం చేద్దాం?'

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులతో ఆదివారం సీఎం జగన్ భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో చర్చించారు. మండలిలో వైకాపాకు బలం తక్కువగా ఉన్నందున.... అక్కడ బిల్లులను ఎలా గట్టెకించాలన్న విషయంపైనే మాట్లాడుకున్నారని సమాచారం.

తెదేపాకే బలం

మండలిలో 58 స్థానాలుండగా. . రెండు ఖాళీలున్నాయి. సభలో వైకాపాకు కేవలం 9 మంది సభ్యులే ఉన్నారు. తెదేపాకే మెజారిటీ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే బిల్లు శాసనసభలో ఆమోదం పొందినా.... శాసన మండలిలో ఆమోదం పొందలేదు. సవరణలు కోరుతూ తిప్పి పంపింది. రేపటి సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం వ్యూహం రచిస్తున్నట్లు తెలిసింది. బిల్లును గట్టెంక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ సమాలోచనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం మండలిలో పెట్టే బిల్లులును అడ్డుకోవాలని తెదేపా ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసినట్టు వార్తలు రాగానే.. ఈ పరిణామానికి చెక్ పెట్టేందుకు అధికార పక్షం సమాలోచనలు చేసింది.

ఇదీ చదవండి:

'ఎన్ని ఆంక్షలున్నా.. అసెంబ్లీని ముట్టడిస్తాం'

Intro:Body:

AP_VJA_38_19_CM_Discussions_on_Bills_PKG_3068069

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.